Hero Vijay BMW Car Entry Tax: కోలీవుడ్ నటుడు విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న బీఎండబ్ల్యూ కారుకు సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ పిటిషన్‌పై తీర్పు వెలువడింది. కేవలం రూ.7.68 లక్షలను.. తమిళనాడు వాణిజ్య పన్నుల శాఖకు చెల్లిస్తే చాలని హైకోర్టు తెలిపింది.
ఇదీ జరిగింది..నటుడు విజయ్ 2005లో రూ.63 లక్షలు వెచ్చించి అమెరికా నుంచి బీఎండబ్ల్యూ కారును దిగుమతి చేసుకున్నారు. ఆ సమయంలో విజయ్ ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదు. దీంతో తమిళనాడు వాణిజ్య పన్నుల శాఖ..2005 నుంచి చెల్లించాల్సిన మొత్తానికి జరిమానా కలిపి రూ.30,23,609 చెల్లించాలని విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో విజయ్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.