తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అడవిలో నగ్నంగా బాలీవుడ్ హీరో - నన్ను నేను తెలుసుకోవడానికంటూ ట్వీట్! - విద్యుత్‌ జమ్వాల్‌ సినిమాలు

Vidyut Jammwal Birthday Latest Photo : బాలీవుడ్​ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ సోషల్ మీడియా వేదికగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. వాటిని చూసిన్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Actor Vidyut Jamamwal Latest Post
Actor Vidyut Jamamwal Latest Post

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 2:28 PM IST

Updated : Dec 10, 2023, 3:08 PM IST

Vidyut Jammwal Birthday Latest Photo :బర్త్​డే రోజు ఓ వినూత్నమైన పని చేసి వార్తలోకెక్కాడు బాలీవుడ్ స్టార్ హీరో విద్యుత్​ జమ్వాల్‌​. ప్రకృతి ఒడిలో సేదాతీరాలని వెళ్లిన ఆయన ఒంటిపైన నూలుపోగు లేకుండా ధ్యానం చేశారు. అంతే కాకుండా కాసేపు అలానే ఉండిపోయారు. ఆ ఫొటోలను తన అభిమానుల కోసం నెట్టింట అప్​లోడ్​ చేశారు. నన్ను నేను తెలుసుకోవడానికే ఇది చేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు.

"హిమాలయ శ్రేణులకు నా తిరోగమనం. ఇది దైవ నివాసం. ఇక్కడికి రావడం 14 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. నేను గ్రహించక ముందే ప్రతి సంవత్సరం 7-10 రోజులు హిమాలయాల్లో గడపడం తన జీవితంలో భాగమైంది. విలాసవంతమైన జీవితనం నుంచి అరణ్యంలోకి వస్తున్నప్పడు, నేను నా ఏకాంతాన్ని కునుక్కుంటాను. 'నేను ఎవరు కాదు' అని తెలుసుకునే ప్రాముఖ్యత గురించి తెలుకుంటాను. ఇతి నేను ఎవరు అని తెలుసుకోవడంలో మొదటి అడుగు. అలాగే ప్రకృతి అందించిన నిశ్శబ్ద విలాసాల్లో నన్ను నేను రక్షించుకుంటాను"
-- విద్యుత్​​ జమ్వాల్​, బాలీవుడ్ నటుడు

విలాసవంతమైన జీవితం నుంచి అరణ్యానికి వచ్చినపుడు ఒంటరితనంలో తన గురించి తాను తెలుసుకునే అవకాశం దొరికిందని పోస్ట్​లో విద్యుత్​ జమ్వాల్​ రాసుకొచ్చారు. కొద్దిరోజుల తర్వాత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇంటికి తిరిగి వస్తానని అన్నారు. ఏకాంతం అనేది అనూహ్యమైనదని అనుభవ పూర్వకంగా మాత్రమే తెలుస్తుందని విద్యుత్​ పేర్కొన్నారు. అయితే విద్యుత్​ షేర్​ చేసిన ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారడం వల్ల నెజిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రకరకాలుగా పోస్ట్​లు చేస్తున్నారు.

Vidyut Jammwal Movies List :కమాండో' సిరీస్ వంటి యాక్షన్ చిత్రాలతో విద్యుత్ జమ్వాల్​ పేరు తెచ్చుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్​లో శక్తి, బిల్లా 2, ఊసరవెల్లి వంటి తదితర సినిమాల్లో విలన్​గా నటించి మెప్పించారు. ఈ నటుడు ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

పాన్ మసాలా యాడ్​లో ఆ ముగ్గురు స్టార్స్ - షాకిచ్చిన అలహాబాద్​ హైకోర్టు

వింటేజ్​ లుక్​లో దళపతి విజయ్- 10 నిమిషాల కోసం రూ.6 కోట్లు ఖర్చు!

Last Updated : Dec 10, 2023, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details