తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వడ్డే నవీన్​ గురించి ఇంట్రెస్టింగ్​ న్యూస్​.. తెగ​ వైరల్​ అవుతోందిగా.. ఏంటంటే? - ఆలీతో సరదాగా

కథానాయకుడిగా 90వ దశకం చివరి నుంచి 2010 వరకూ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు వరుస సినిమాలతో అలరించిన నటుడు హీరో వడ్డే నవీన్‌. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ వార్త బాగా వైరల్​ అవుతోంది. ఏంటంటే?

Vadde naveen alitho saradaga
ఆలీతో సరదాగా షోకు వడ్డే నవీన్‌

By

Published : Sep 16, 2022, 3:00 PM IST

వడ్డే నవీన్‌.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వడ్డే రమేష్​ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్​హిట్​ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలా కథానాయకుడిగా 90వ దశకం చివరి నుంచి 2010 వరకూ దాదాపు పది, పన్నెండేళ్ల పాటు వరుస సినిమాలతో అలరించారు.

ఇక ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్‌ షో 'ఆలీతో సరదాగా'. నేటి తరం నటులతో పాటు, అలనాటి నటులు, దర్శకులతో ఆలీ సాగించే సంభాషణ చాలా సరదాగా ఉంటుంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో, పూర్తి ఎపిసోడ్‌ యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాగానే, వేల సంఖ్యలో కామెంట్లు వస్తాయి. అలాంటి వాటిలో ఎక్కువ కనిపించేది 'వడ్డే నవీన్‌ను ఇంటర్వ్యూకు పిలవండి'.

అయితే దీనిపై 'ఆలీతో సరదాగా' నిర్మాణ సంస్థ జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ స్పందించింది. వడ్డే నవీన్‌ ప్రస్తుతం ఏ షోలకూ రావడం లేదని, తమని, అనిల్‌ని తిట్టవద్దని జ్ఞాపిక ప్రొడక్షన్స్‌ నిర్మాత ప్రవీణ అన్నారు. ఇదే విషయమై ఆలీ మాట్లాడుతూ.. "వడ్డే నవీన్‌ను చాలా సార్లు పిలిచాం. దానికి ఆయన స్పందిస్తూ, ''తప్పకుండా మీ షోకు వస్తాను. కానీ, ఏదైనా అద్భుతం చేసి వస్తా' అని చెబుతారు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య స్నేహం దాదాపు 30ఏళ్లుగా కొనసాగుతోంది. మేమంతా చెన్నైలోని ఒకే వీధిలో ఉండేవాళ్లం. ఒక నిర్మాత కుమారుడన్న గర్వం ఎప్పుడూ ఆయనకు లేదు. స్నేహానికి మంచి విలువ ఇచ్చేవారు" అని ఆలీ చెప్పుకొచ్చారు. మరి వడ్డే నవీన్‌ అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.

ఇదీ చూడండి:'పెళ్లి' కోసం వడ్డే నవీన్​ పాట్లు.. ఆపేందుకు మరో యాక్టర్​ ప్రయత్నాలు.. చివరికి!

ABOUT THE AUTHOR

...view details