Vijayakanth Discharged from Hospital :ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పూర్తిగా కోలుకున్నారు. చెన్నైలోని పైవేటు ఆస్పత్రి నుంచి సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు డీఎండీకే పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ విషయం తెలియడం వల్ల విజయ్‌కాంత్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
Vijayakanth Health Satus :శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం వల్ల కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను ఇటీవల ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల తర్వాత మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆయన పూర్తిగా కోలుకోవడం వల్ల సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డయాబెటిస్ కారణంగా గతంలో ఆయన కుడికాలి మూడు వేళ్లను తొలగించారు. అనారోగ్య కారణాలతో విజయ్‌కాంత్ కొంత కాలంగా సభల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
Vijayakanth Health Latest News :ఇటీవల విజయ్‌కాంత్ ఆరోగ్యానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చెన్నైలోని ఎమ్ఐఓటీ ఆస్పత్రి స్పందించి విజయ్‌కాంత్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపింది. విజయ్‌కాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా వివరాలు వెల్లడించారు.