దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి మూడేళ్లు అవుతున్నా అతడి సూసైడ్ కేసు మిస్టరీ వీడలేదు. అతడి అభిమానులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. సోషల్మీడియాలో అతడిపేరుతో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు అతడి అభిమానులు మరో బాధకరమైన విషయం తెలిసింది. సుశాంత్ పెంపుడు కుక్క ఫడ్జ్ కన్నుమూసింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
సుశాంత్ సింగ్ ఇంట మరో విషాదం.. ఆ ఇద్దరు స్వర్గంలో కలుస్తారంటూ ఫ్యాన్స్ ఆవేదన - sushant dog fudge
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ మిస్టరీ వీడకముందే అతడి ఇంట్లో మరి విషాదం చోటు చేసుకుంది. దీంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'ఫడ్జ్.. స్వర్గంలో ఉన్న నీ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిపోయావు. మేము కూడా ఏదో ఒకరోజు నీ దగ్గరికి వచ్చేస్తాం.. అప్పటివరకు మాకీ బాధ తప్పదు' అని భావోద్వేగంతో ట్వీట్ చేసింది. దీనికి సుశాంత్, తాను కుక్కతో కలిసి దిగిన పాత ఫోటోలను జత చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు శునకం మరణంపై విచారం వ్యక్తం చేశారు.
'యజమాని చనిపోయిన తర్వాత కుక్క సంతోషంగా, ఎప్పటిలా మామూలుగా ఉండలేదు. ఆ బాధతోనే ఇన్నేళ్లు బతికి చివరికి తన యజమానిని చేరుకుంది', 'సుశాంత్ గురించి ఏ చిన్నవార్త తెలిసినా తట్టుకోలేకపోతున్నాను.. ఇప్పుడు ఫడ్జ్ చనిపోయిందంటే దుఃఖం దానంతటదే వస్తోంది.. మిస్ యూ ఫడ్జ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020లో జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన ఫడ్జ్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు. రూమ్‌లో ఉన్నపుడు అదే అతడి ప్రపంచం కూడా. దాన్ని ఆడిస్తూ.. ఆడుకుంటూ ఉండేవాడు. అయితే సుశాంత్ మరణించాకు ఫడ్జ్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. తలుపు చప్పుడు అయితే చాలు సుశాంత్ వచ్చాడేమో అనుకుని వెళ్లిపోయేదాని, అతడి ఫొటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది అప్పట్లో వార్తలు, ఫొటోలు కూడా విపరీతంగా వచ్చాయి. చాలామంది సుశాంత్ ఫడ్జ్‌తో ఆడుకున్న వీడియోలను తెగ షేర్ చేశారు.