తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నన్ను కొట్టి 5 రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా బంధించారు: సందీప్​ కిషన్​ - మైఖేల్ హీరో సందీప్​ కిషన్​ మూవీస్​

యంగ్​ హీరో సందీప్​ కిషన్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మైఖేల్​'. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్​ సినిమా శనివారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సందీప్‌ కిషన్‌. ఆ విశేషాలు మీ కోసం..

Actor sundeep kishan Michael Movie
sundeep kishan

By

Published : Feb 3, 2023, 10:32 AM IST

''కథలో కొత్తదనం, బలమైన భావోద్వేగాలు ఉండి.. విజువల్‌ ఆసక్తిరేకెత్తించేలా ఉంటే కచ్చితంగా ఆ చిత్రం అందర్నీ మెప్పిస్తుందని నమ్ముతా. అవన్నీ 'మైఖేల్‌'లో చక్కగా కుదిరాయి'' అన్నారు సందీప్‌ కిషన్‌. ఆయన హీరోగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రంజిత్‌ జయకోడి తెరకెక్కించారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు సందీప్‌ కిషన్‌. ఆ విశేషాలివి..

'మైఖేల్‌'ను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?
''ఈ కథకు, దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరుకు పాన్‌ ఇండియా సామర్థ్యం ఉంది. యాక్షన్‌ చాలా ఫ్రెష్‌గా.. ఎంతో వాస్తవికంగా ఉంటుంది. మనం ఊహించిన దాని కంటే సర్‌ప్రైజ్‌ ఉంటుంది. సినిమా చూసుకున్నాం. చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్‌ కాపీ చూశాక కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పకుండా సినిమా చూశాక అందరికీ అదే అనుభూతి కలుగుతుంది''.

సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లున్నారు?
''టీజర్లు, ట్రైలర్లు చూస్తే ఇదొక యాక్షన్‌ సినిమా అనిపించొచ్చు కానీ, నిజానికి ఇదొక భావోద్వేగభరితమైన చిత్రం. 1980-90ల మధ్య కాలం నాటి గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచంలో సాగే కథగా ఉంటుంది. అలాగని ఇదేమీ 'రక్త చరిత్ర'లాంటి గ్యాంగ్‌స్టర్‌ డ్రామా కాదు. చీకటి ప్రపంచంలో ఉండే కొన్ని పాత్రల ఎమోషనల్‌ జర్నీ. ఈ చిత్రానికి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా''.

'మైఖేల్‌' జానర్‌ ఏంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
''ఇది చాలా వినూత్నమైన కథ. దాన్ని తెరపై చూపించే విధానం కూడా చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో అంతా చెడ్డ వ్యక్తులే. ఆ చెడ్డ వారి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఇందులో డార్క్‌ కామెడీ ఉంటుంది. ఇందులో నేను టైటిల్‌ పాత్రలో నటించాను. తనకు స్నేహితులు ఉండరు. ఎవరితో మాట్లాడడు. చాలా వైల్డ్‌గా ఉంటాడు. తను గ్యాంగ్‌స్టర్‌ కాకపోయినా.. ఆ పాత్ర తాలూకూ దుందుడుకు స్వభావం కలిగి ఉంటాడు. అతను చేసే పనులన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నేనిప్పటి వరకు ఈ 'మైఖేల్‌' లాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు''.

ఈ సినిమా విషయంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?
''ఈ కథలో మైఖేల్‌ పాత్రను కొట్టి 5రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా ఎక్కడో బంధిస్తారు. ఆ సీన్‌ చేస్తున్నప్పుడు నిజంగానే నీళ్లు తప్పితే ఏమీ తీసుకోలేదు. దాదాపు 18రోజుల పాటు కఠినమైన ఆహార నియమాల్ని పాటించాను. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అప్పుడు ఒక ఫైట్‌ షూట్‌ చేశాం. పొరపాటున నా కాలు సరైన విధంగా లాండ్‌ కాలేదు. బాగా నొప్పి చేసేసింది. దీంతో షూట్‌ ఆపేశాం. అలాగే ఈ చిత్రాన్ని చాలా చీకటి ప్రదేశాల్లో చిత్రీకరించాం. గాజు పెంకులు గుచ్చుకునేవి. ఈ ప్రయాణమంతా ఎంతో సవాల్‌గా అనిపించేది. చాలా రోజుల తర్వాత నాతో ఎంతో పని చేయించుకున్న చిత్రమిది. ఈ సినిమా కోసం నేను బరువు తగ్గాను. స్కూబా డైవింగ్‌ నేర్చుకున్నా. నీటి అడుగు భాగాన చిత్రీకరణ జరిపాం. ఈ ప్రయాణమంతా నాకెంతో సంతృప్తినిచ్చింది''.

ఈ సినిమాతో మీకు అదృష్టం కూడా కలిసి వస్తుందని నాని అన్నారు. దాన్ని నమ్ముతారా?
''నాని చాలా స్వీట్‌. నిజంగానే నాకు అదృష్టం కలిసి రాలేదని, రావాల్సినంత గుర్తింపు రాలేదని చాలా మంది అంటుంటారు. నాని చెప్పినట్లు ఈ చిత్రంతో నాకు అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా. రంజిత్‌ ఈ సినిమాని మేము అనుకున్న దాని కన్నా గొప్పగా తీశాడు. కచ్చితంగా అందరూ మెచ్చేలా ఉంటుందని నమ్ముతున్నా''.

''ప్రస్తుతం నేను 'బైరవ కోన', 'బడ్డీ', 'కెప్టెన్‌ మిల్లర్‌' చిత్రాలు చేస్తున్నా. మూడూ వేటికవే భిన్నమైన సినిమాలు. దీంతో పాటు 'ఫ్యామిలీమ్యాన్‌-3' వెబ్‌సిరీస్‌ ఉంది. అలాగే త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ ప్రకటించనున్నా''.

ABOUT THE AUTHOR

...view details