చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని.. అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్‌బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని.. అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్‌బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. 'సమ్మోహనం', 'వి' తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ.. తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు ముచ్చటించారు. ఆ విషయాలివీ..
ఇంతకీ ఆ అమ్మాయి గురించి ఏం చెబుతున్నారు?
ఏం చెబుతున్నాం అనేది ట్రైలర్‌లోనే కొంతవరకు చూపించాం. కంటి వైద్యురాలైన ఓ అమ్మాయిని చూసి తన సినిమా కోసం ఎంపిక చేయాలనుకుంటాడు ఓ దర్శకుడు. దానికి వాళ్ల ఇంట్లో అస్సలు అంగీకరించరు. మరి ఆ దర్శకుడు ఎలా ఒప్పించాడు? ఆ అమ్మాయి ఒప్పుకున్నాక ఎలాంటి సమస్యలు వచ్చాయనేది తెరపైనే చూడాలి. నేను ఇందులో ఓ సినిమా దర్శకుడిగా కనిపిస్తా.
ఇంద్రగంటి దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మీకూ, ఆయనకీ మధ్యనున్న అనుబంధమే అందుకు కారణమా?
'మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం కానీ, సినిమానే మనల్ని తీస్తుంది' అని ఈ సినిమా వేడుకలో నేను చెప్పా. ఇంద్రగంటి రాసుకున్న కథలే మమ్మల్ని ఎంచుకుంటున్నాయనేది నా అభిప్రాయం. నన్ను నటుడిగా ఆయన నమ్మారు, ఆయన కథల్ని నేను నమ్ముతాను. అదే మా కలయికలో సినిమాలు రావడానికి కారణం. ఆయన ఎప్పుడూ ఒక కలయికని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయరు. ఒకసారి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో దర్శకుడు సుకుమార్ కలిసినప్పుడు కూడా ఇదే మాటే చెప్పారు. హిట్ ఇచ్చిన వెంటనే దర్శకులు పెద్ద స్టార్లని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తుంటారు. ఇంద్రగంటి మాత్రం తను రాసుకున్న కథలకి తగ్గట్టుగానే నటుల్ని ఎంచుకుని సినిమాలు చేస్తారు. మార్కెట్, ఇతరత్రా లెక్కలేవీ ఆయన పట్టించుకోరు. ఆయన కథలకి తగ్గ కథానాయకుడిని నేను కావడం అదృష్టంగా భావిస్తానంతే.
మొదట ఈ కథని ఎప్పుడు విన్నారు?
'వి' చిత్రీకరణ మధ్యలోనే ఒకసారి చెప్పారు. అయితే అది నాకోసమని కాకుండా, తన మనసులో ఉన్న కథల్ని పంచుకుంటుంటారు. అయితే ఈ కథ నా దగ్గరికి వస్తుందని అనుకోలేదు. 'సమ్మోహనం' తరహాలో ఇది కూడా సినిమా నేపథ్యంలో సాగే కథే కానీ, దానికీ దీనికీ మధ్య ఏమాత్రం పొంతన ఉండదు. 'సమ్మోహనం' అబ్బాయి, అమ్మాయి మధ్యలో సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. ఇది మాత్రం ప్రేమ, కుటుంబం, డ్రామా అంశాలతో సాగుతుంది. ఇంద్రగంటి తీసిన సినిమాల్లో భావోద్వేగాల పరంగా బలమైన చిత్రమిదే. కృతిశెట్టి చాలా బాగా నటించింది. ఆమె 'ఉప్పెన' కంటే ముందే ఒప్పుకున్న సినిమా ఇది.
చాలా మంది దర్శకులతో కలిసి ప్రయాణం చేశారు. తెరపై దర్శకుడిగా నటించడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
ప్రతి కమర్షియల్ దర్శకుడికీ ఓ అభిరుచి ఉంటుంది. నా పాత్ర కూడా అంతే. కొంచెం తిక్క కూడా ఉంటుంది. ఎలాంటి సినిమాలు తీసినా ఒక బలమైన కారణం ఉంటుంది, కమర్షియల్ దర్శకులు తీసేది కూడా మంచి సినిమానే అనే విషయాన్ని స్పృశించిన తీరు ఆకట్టుకుంటుంది. అతను తీసేదే సినిమా అని భావించే దర్శకుడిగా కనిపిస్తా. కొంచెం స్టైలిష్‌గా, మన దర్శకులు కనిపించే తీరుకి భిన్నంగానే కనిపిస్తా. ఇదివరకు సినిమాలు చేసేటప్పుడు కథలో ఎక్కడో ఒక చోట ఇంద్రగంటి కనిపించేవారు. కానీ ఈ పాత్రలో ఆయన అస్సలు కనిపించలేదు. సినిమా నేపథ్యంలో కథే అయినా సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా చాలా సహజంగా సాగుతుందీ చిత్రం.