Sudeep Defamation On Producers : శాండిల్‌వుడ్ నటుడు సుదీప్.. నిర్మాతలు ఎం.ఎన్ కుమార్, ఎం.ఎన్ సురేశ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. తన గురించి విమర్శలు చేసినందుకు గాను మూడు రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆయన లీగల్ టీమ్ తాజాగా ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.
సుదీప్ కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురై..
Sudeep Family : "నిర్మాతలు ఎం.ఎన్.కుమార్, ఎం.ఎన్.సురేశ్ చేసిన ఆరోపణలతో సుదీప్, ఆయన కుటుంబం మానసిక వేదనకు గురైంది. వాళ్ల మాటలు ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన ఇమేజ్‌కు భంగం కలిగించాయి. తనని అభిమానించే, ఆదర్శంగా తీసుకునే ప్రేక్షకులు సైతం ఈ విషయంపై చర్చించుకోవడం ఆయన్ని ఎంతగానో కలచివేసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు సుదీప్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఆరోపణల వల్ల ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్లు భయపడుతున్నారు. ఇచ్చిన ఆఫర్లను కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు" అని ఆ స్టేట్‌మెంట్‌లో రాసి ఉంది.