తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బుల్లితెర నటి సూసైడ్​ కేసు.. మాజీ లవర్​ అరెస్ట్​.. అతడితో బ్రేకప్​ వల్లే..! - Tunisha Sharma death case

టీవీ నటి తునిషా శర్మ ఆత్యహత్య కేసులో తన సహనటుడు షీజన్​ ఖాన్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా అతడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా, షీజన్​తో బ్రేకప్​ కావడమే తునిష ఆత్మహత్యకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 25, 2022, 4:07 PM IST

Updated : Dec 25, 2022, 5:03 PM IST

హిందీ టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తునిష మరణంపై పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. తునిష తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె సహ నటుడు షీజన్​ను అరెస్టు చేశారు. అనంతరం ముంబయిలోని వాసాయి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు అతడికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. కాగా, పోస్టుమార్టం నివేదిక వచ్చిందని.. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఏసీపీ చంద్రకాంత్​ జాదవ్​ తెలిపారు.

తునిషా శర్మ, షీజన్ ఖాన్

'షీజన్..​ నీవెవరో నీకు తెలియదు'
తునిషా శర్మ.. ఆమె సహనటుడు షీజన్​ ఖాన్​తో కొంతకాలం ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అతడి గురించి ఆమె పెట్టిన ఓ పోస్ట్​ ఇప్పుడు వైరల్​ అవుతోంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా షీజన్​కు శుభాకాంక్షలు తెలిపింది. ఓ ఫొటోను పోస్ట్​ చేస్తూ.. 'నన్ను ఇలా పైకెత్తే మనిషికి.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకంక్షలు. నా జీవితంలో.. అత్యంత శ్రమించే, ఉత్సాహవంతుడైన, అందమైన మనిషి నువ్వే. నీవెవరో నీకు తెలియదు. అదే నీలో నాకు నచ్చే మంచి విషయం' అంటూ రాసుకొచ్చింది. కాగా, కొద్ది కాలంగా షీజన్​.. తునీషాను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు.

తునిషా శర్మ, షీజన్ ఖాన్

మరో సహనటుడిని విచారించిన పోలీసులు..
తునిష ఆత్మహత్యపై ఆమె మరో సహనటుడు పార్థ్​ జుట్సీని పోలీసులు విచారించారు. దీని పార్థ్​ స్పందించారు. 'ఈ కేసు విచారణలో భాగంగా నన్ను పోలీసులు పిలిచారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. నేను ఆమె(తునిష) రిలేషన్స్​ గురించి మాట్లాడదలచుకోలేదు. వాటి గురించి నాకు ఏం తెలియదు. అది ఆమె పర్సనల్​ మ్యాటర్. ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుసు. కానీ ఆ తర్వాత ఆమె చనిపోయిందని చెప్పారు' అని పార్థ్​ తెలిపారు.

తునిషా శర్మ, షీజన్ ఖాన్

ఆఖరి పోస్ట్ అది..
'అభిరుచితో పనిచేసే వారు ఎప్పటికీ ఆగరు' ఇన్​స్టాగ్రామ్​లో ఆఖరిగా తునిష ఓ పోస్ట్​ చేసింది. ఇదే కాకుండా చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా ఓ వీడియోను కూడా పోస్ట్​ చేసింది. అందులో మేకప్​ సిబ్బంది ఆమెకు మేకప్​ వేస్తూ ఉన్నారు. అందులో ఆమె చాలా మూడీగా ఉంది. ఏదో కారణంతో బాధపడుతున్నట్టు కనిపించింది. ఆ కొద్ది సమయానికే ఆత్మహత్యకు పాల్పడింది.

తునిషా శర్మ చివరి ఇన్​స్టా పోస్టు

షూటింగ్​ సెట్​లో ఆత్మహత్య..
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయిలో తాను నటిస్తున్న టీవీ సీరియల్‌ సెట్‌లోనే తునిషా శర్మ శనివారం ఆత్మహత్య చేసుకుంది. టీ విరామ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన తునిషా ఎంతకు తిరిగిరాలేదు. చాలాసేపు వేచి చూసిన సిబ్బంది అనుమానంతో పోలీసులకు.. సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బాత్‌రూమ్‌ తలుపులు బద్దలు కొట్టి చూడగా తునిష ఉరివేసుకుని కనిపించింది

తునిషా శర్మ

బాలనటిగా కెరీర్​ మొదలు..
బాలనటిగా కెరీర్‌ మొదలుపెట్టిన తునిష పలు చిత్రాల్లో కూడా నటించింది. కత్రినా కైఫ్‌, విద్యాబాలన్‌ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. 'భారత్‌ కా వీర్‌ పుత్ర' అనే సీరియల్‌తో 13 ఏళ్లకే నటిగా మారిన తునిష 'చక్రవర్తి అశోక సామ్రాట్‌', 'గబ్బర్‌ పూన్చావాలా', 'ఇంటర్నెట్‌ వాలాలవ్‌', 'హీరో: గాయబ్‌ మోడ్‌ ఆన్‌' తదితర ధారావాహికల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. వెండితెరపైన సందడి చేసింది. 'ఫితూర్‌' సినిమాలో కథానాయిక కత్రినా కైఫ్‌ చిన్నప్పటి పాత్ర పోషించింది.

తునిషా శర్మ, షీజన్ ఖాన్
Last Updated : Dec 25, 2022, 5:03 PM IST

ABOUT THE AUTHOR

...view details