తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ.. గ్రాండ్​గా హల్దీ ఫంక్షన్​.. వీడియో చూశారా? - శర్వానంద్​ వివాహం

Sharwanand Marriage : హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. మొదటి రోజు హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sharwanand Marriage
Sharwanand Marriage

By

Published : Jun 2, 2023, 10:15 PM IST

Sharwanand Marriage : టాలీవుడ్ హీరో శర్వానంద్-హర్షిత రెడ్డిల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్​లోని జైపూర్‌ ప్యాలెస్‌ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూలతో పాటు కుటుంబ సభ్యులు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు హల్దీ వేడుకలతో సందడి మొదలైంది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది.

ఈ వీడియోలో శర్వానంద్ తెల్లని దుస్తులు ధరించాడు. అక్కడున్న వారి బంధువులకు శర్వానంద్​కు పసుపు పూయడం కనిపించింది. ఇంకా మెహందీ, సంగీత్ వేడుక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. జూన్3న వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నారు శర్వానంద్‌.

రక్షిత ఎవరంటే?.. హీరో శర్వానంద్​తో జీవితం పంచుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం ఆమె ఫారెన్​లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారట. ఆమె తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది. అంతే కాదు... ఆమె ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనమరాలు కూడా!

Sharwanand Wife : శర్వానంద్‌, రక్షితల నిశ్చితార్థం ఈ ఏడాది జనవరిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ ఎంగేజ్మెంట్​కు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రామ్ చరణ్ దంపతులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు శర్వా, రక్షిత పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. జూన్ 3 ఉదయం 11:30 గంటలకు శర్వాను పెళ్లి కుమారుడు చేసే కార్యక్రమం ఘనంగా జరగనుంది. రాత్రి 11 గంటలకు శర్వా, రక్షిత మెడలో మూడు ముళ్లు వేసి ఏడడుగులు వేయబోతున్నారు. ఈ పెళ్లి వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు. అంతేకాకుండా శర్వానంద్ స్వయంగా వెళ్లి కొంతమంది ప్రముఖులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Sharwanand Movies : ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. శర్వా రీసెంట్ గా ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్​ను అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సపోర్టింగ్ పాత్రలు మాత్రమే చేస్తూ తన టాలెంట్​ను నిరూపించుకున్నారు. తర్వాత శర్వాలోని ప్రతిభను చూసి వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా గమ్యం, ప్రస్థానం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత రన్ రాజా రన్, ఎక్స్​ప్రెస్​ రాజా, శతమానంభవతి, మహానుభావుడు వంటి కమర్షియల్ హిట్స్​ను అందుకున్నారు. మధ్యలో సరైన హిట్ లేక ఇబ్బంది పడినా తర్వాత మళ్లీ గాడిన పడ్డారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై తెరకెక్కుతోంది. పెళ్లి కోసం ఈ సినిమా షూటింగ్​కు కాస్త గ్యాప్ ఇచ్చారు శర్వానంద్.

ABOUT THE AUTHOR

...view details