తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Maayon movie: కట్టప్ప తనయుడి చిత్రం.. ఉత్కంఠగా ట్రైలర్ - బాహుబలి కట్టప్ప సత్యరాజ్​

Maayon movie trailer: 'కట్టప్ప' సత్యరాజ్​ తనయుడు శిబిరాజ్​ హీరోగా యువ దర్శకుడు కిషోర్​ రూపొందించిన చిత్రం 'మాయోన్' తెలుగులో జులై 7న రిలీజ్​ కానుంది. ​ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్​ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ విడుదల చేశారు.

maayon trailer
మాయోన్ ట్రైలర్​

By

Published : Jul 2, 2022, 1:37 PM IST

మాయోన్ ట్రైలర్​ రిలీజ్​ ఈవెంట్​

Maayon movie trailer: కట్టప్ప పాత్రలో ఎనలేని గుర్తింపు పొందిన తమిళనటుడు సత్యరాజ్. ఆయన తనయుడు శిబి సత్యరాజ్ నటించిన చిత్రం 'మాయోన్'. మైథలాజికల్ సైన్స్ ఫింక్షన్​గా కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ చిత్రం అదే పేరుతో తెలుగులో జులై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్​లో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా మయోన్ తెలుగు ట్రైలర్​ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రల్లో సత్యరాజ్​కు ఎంతో మంది అభిమానులున్నారని, ఆయన కుమారుడు శిబికి కూడా మయోన్ చిత్రం మంచి పేరు తీసుకురావాలని విజయేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.

కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్​ మాస్ట్రో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హై టెక్నికల్​ వాల్యూస్​తో రూపొందిన ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ రాంప్రసాద్​ మయోన్ను సెల్యూలాయిడ్​ వండర్​గా మలిచారు. ఈ చిత్రంలో శిబి సత్యరాజ్​.. ఆర్కియాలజిస్ట్​గా నటించారు.


ఇదీ చూడండి: అతనితో శారీరకంగా కలిశా.. అబార్షన్​ చేయించుకున్నా: నటి షాకింగ్ కామెంట్స్​

ABOUT THE AUTHOR

...view details