తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నటుడు సత్యదేవ్​ ఫ్యామిలీ ఫొటో చూశారా? - నటుడు సత్యదేవ్​ సినిమాలు

టాలీవుడ్‌లో తమ విలక్షణమైన నటనతో అతి తక్కువ సమయంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు నటుడు సత్యదేవ్‌. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈయన ఫ్యామిలీ ఫొటో ఎప్పుడైనా చూశారా?

actor satya raj wife and family photos
నటుడు సత్యదేవ్​ ఫ్యామిలీ ఫొటో చూశారా?

By

Published : Feb 8, 2023, 10:58 PM IST

Updated : Feb 8, 2023, 11:05 PM IST

తక్కువ సమయంలో మంచి ఫేమ్ సంపాదించకున్న నటుడు సత్యదేవ్​కు పెళ్లైనా విషయం అందరికి తెలిసిందే. అయితే సినిమాల్లోకి రాకముందే ఆయనకు వివాహం జరిగింది. కానీ ఇంత వరకు తన కుటుంబాన్ని ఆయన ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. రీసెంట్​గా​ తాను హీరోగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా మూవీ ప్రమోషన్‌ ఈవెంట్‌లో తన భార్యను పరిచయం చేశాడు సత్యదేవ్. అయితే తాజాగా తన కొడుకును కూడా పరియయం చేశాడు సత్యదేవ్​. తన కొడుకు బర్త్​డే సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో సత్య దేవ్‌, అతడి భార్య దీపికా, కొడుకు సవర్ణిక్‌ ఉన్నారు.

"సవర్ణిక్ మూడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని కొడుకుకు బర్త్‌డే విషెస్‌ తెలిపాడు సత్యదేవ్​. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. సత్య దేవ్‌ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ కొందరు, మీ ప్యామిలీ చాలా అందంగా ఉందంటూ ఇంకొందరు, చూడముచ్చటైన జంట అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

సత్యదేవ్​ తన నటనతో అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవలె మెగాస్టార్‌ చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌' చిత్రంలో కీలక పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. తాజాగా 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో హీరోగా అలరించాడు.ప్రస్తుతం సత్యదేవ్ కృష్ణమ్మ, పుల్ బాటిల్ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి:కేతిక శర్మ గ్లామర్ ట్రీట్​.. చూస్తే కెవ్వు కేకే

Last Updated : Feb 8, 2023, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details