తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దసరాకు 'ఆదిపురుష్'​ చిరుకానుక- 'నేనే వస్తున్నా' అంటున్న ధనుష్​ - ప్రభాస్​ మూవీ అప్డేట్స్​

ప్రభాస్ అభిమానులకు ఈ దసరా పండుగ ప్రత్యేకంగా నిలిచిపోనుంది! 'ఆదిపురుష్​' సినిమా ప్రచారాన్ని దసరా సందర్భంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ మేరకు అభిమానులకు ఓ సర్​ప్రైజ్ ప్లాన్​ చేసిందట! మరోవైపు, తమిళ హీరో ధనుష్​ 'నేనే వస్తున్నా' అని అంటున్నారు. ఓ సారి ఆ సినిమా విశేషాలేంటో చూసేద్దామా!

actor-prabhas-adipurush-update-and-actor-dhanush-new-movie
actor-prabhas-adipurush-update-and-actor-dhanush-new-movie

By

Published : Sep 15, 2022, 6:33 AM IST

Prabhas AdiPurush : 'ఆదిపురుష్‌' ప్రచారం షురూ కానుందా? దసరా నవరాత్రుల్లోనే అందుకు ముహూర్తం పెట్టారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ప్రభాస్‌ కథానాయకుడిగా ఓంరౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రమిది. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతికతతో భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు, హిందీతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రచారాన్ని మొదలు పెట్టడానికి దసరా ఉత్సవాల్ని మించిన మంచి సమయం మరొకటి దొరకదని భావించిన చిత్రబృందం. ఆ మేరకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేలా ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ వర్గాల సమాచారం మేరకు అక్టోబరు 3న లుక్‌ విడుదల కావొచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్‌ రాఘవగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌గా, సన్నీసింగ్‌ లక్ష్మణగా నటించారు. సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు సమాచారం.

సుదీర్ఘ విరామం తర్వాత..
Dhanush Upcoming Movie : కథానాయకుడు ధనుష్‌ సుదీర్ఘ విరామం తర్వాత ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన తమిళ చిత్రం 'నానే వరువేన్‌'. తెలుగులో 'నేనే వస్తున్నా' పేరుతో గీతా ఆర్ట్స్‌ సమర్పణలో విడుదలవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది.

ధనుష్‌ - సెల్వరాఘవన్‌ కలయికలో వస్తున్న నాలుగో చిత్రమిది. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కలయికకి తోడు, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం, ఓం ప్రకాష్‌ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇటీవలే సినిమా విడుదల గురించి చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌.థాను హైదరాబాద్‌లో గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ని కలిశారనిని సినీ వర్గాలు తెలిపాయి. యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్‌, ఎల్లి అవ్రామ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: ధనుష్‌, సెల్వరాఘవన్‌.

ఇదీ చదవండి:త్వరలో బుల్లితెరపైకి బాలీవుడ్​ జంట.. అందుకోసమేనట!

అలా చేసినందుకు ఆ ఇద్దరు స్టార్​ హీరోలపై కేసు నమోదు.. ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details