Nithin New Movie : యంగ్ హీరో నితిన్- వక్కంతం వంశీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఆదివారం ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ.. హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈ సినిమాకు 'ఎక్స్ ట్రా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. 'ఆర్డినరీ మ్యాన్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.
'ప్రతి ఆర్డినరీ వ్యక్తికి ఒక ఎక్సాట్రాడినరీ స్టోరీ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా సినిమాను డిసెంబర్ 23 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. మరింత ఎక్కువ ఫన్, ప్రేమను ప్రేక్షకులందరికీ పంచేందుకు ఎదురుచూస్తున్నా' అని హీరో నితిన్ తెలిపారు. కాగా ఈ సినిమాలో నితిన్‌కు జంటగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. హరీశ్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్లో నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా నితిన్ 'రంగ్‌దే', 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ సినిమాతో గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని నితిన్ అలోచిస్తున్నారు.
సూర్య కంగువా..
తమిళ స్టార్ హీరో సూర్యప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా 'కంగువా'. అయితే ఆదివారం హీరో సూర్య జన్మదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. కాగా మూవీ యూనిట్ ఇదివరకే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే అకట్టుకున్న నేపథ్యంలో.. తాజా పోస్టర్ ఫ్యాన్స్‌కు మరింత జోష్‌నిచ్చింది.
ఓ యోధుడిలా చేతిలో కత్తి పట్టి.. గుర్రపు స్వారీ చేస్తున్నట్లు సూర్య పోస్టర్లో కనిపిస్తున్నారు. దీంతో సినిమాలో సూర్య యాక్షన్ చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు. సూర్యకు జంటగా దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సిరుత్తై శివ దర్శకత్వం వహించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2024 వేసవిలో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
జవాన్ పోస్టర్..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 'జవాన్' సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ నటుడు ఎవరో గెస్ చేయండంటూ ఆదివారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. కానీ ఈ పోస్టర్లో నటుడి కన్ను మాత్రమే కన్పిస్తోంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న 'విజయ్ సేతుపతి' దే ఫస్ట్ లుక్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా లేడీ సూపక్ స్టార్ నయనతార, నటి ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్ అట్లీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న విడుదల కానుంది.