తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నవదీప్​ కాలుకు ఏమైంది? తేజస్విని ఎందుకు అలా చేసిందంటే.. - నవదీప్​కు గాయాలు

Navdeep Injury : టాలీవుడ్ నటుడు నవదీప్​ కాలికి గాయమైంది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో బిగ్​బాస్​ ఫేమ్​ నటి తేజస్విని ఇన్​స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఆమె నవదీప్​ను తెగ ఆటపట్టించింది. ఎందుకంటే ?

navdeep injury
hero navdeep injury

By

Published : Jul 6, 2023, 4:11 PM IST

Navdeep Injury : 'చందమామ','ఆర్య2','బాద్​షా' లాంటి సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు టాలీవుడ్​ హీరో నవదీప్​. తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు పొందిన ఈ నటుడు హీరోతో పాటు సపోర్టింగ్​ రోల్స్​లోనూ మెరిశారు. ఇటీవలే 'న్యూసెన్స్​' అనే సిరీస్​తో టాలీవుడ్​ ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం మాస్​ మహారాజా లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఈగల్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ​ ఇటీవలే ఆయన కాలు ఫ్రాక్చర్​ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్​.. నటి తేజస్విని ఓ వీడియో ద్వారా తెలియజేసింది. ఇటీవలే ఆయన్ను పరామర్శించడానికి వచ్చిన తేజూ.. తనను ఆటపట్టిస్తూ ఓ రీల్ చేసింది. దాన్ని తన ఇన్​స్టా అకౌంట్​లో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది. దీన్ని చూసిన కొందరు 'గెట్​ వెల్​ సూన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. పలువురు స్టార్స్​ సైతం ఈ పోస్ట్​పై కామెంట్లు పెట్టారు.

Navdeep Movies : ఇక నవదీప్​ సినిమాల విషయానికి వస్తే.. 'జై' సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన నవదీప్​.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. 'ఆర్య 2', 'బాద్ షా', 'అల వైకుంఠ పురంలో' లాంటి సినిమాల్లో నటించిన ఈ స్టార్​.. తన యాక్టింగ్​తో ప్రేక్షకులను మెప్పించారు. ఇక పలు సినిమాల్లో నెగిటివ్​ షేడ్స్​ ఉన్న పాత్రల్లో కనిపించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు బుల్లితెరలోనూ మెరిసిన ఈ స్టార్​.. పలు షోల్లో జడ్జీగా.. ఇంకొన్నింటిలో పార్టిసిపెంట్​గా వచ్చి టీవీ ఆడియెన్స్​కు దగ్గరయ్యారు . ప్రస్తుతం ఓటీటీల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు.

దర్శకుడు రామ్​గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఐస్​క్రీమ్' సినిమాలో నవదీప్-తేజస్విని తొలిసారి స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు.ఆ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన వీళ్లిద్దరూ.. సమయం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు కలుస్తూ సందడి చేస్తుంటారు. గతంలో ఒకసారి తేజు కాలికి గాయమైన సమయంలో నవదీప్ కూడా ఇలానే ఆమెను ఆటపట్టించాడట. దీంతో ఫ్యాన్స్​ ఇది కామెడీతో కూడిన రివెంజ్​ వీడియోలా ఉందే అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details