సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కంప్లెంయిట్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నరేశ్-పవిత్రా లోకేశ్.. ఆ ఛానళ్లపై ఫిర్యాదు
సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్‌పై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా, కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్గా ప్రేక్షకులను అలరించారు పవిత్రా లోకేష్. సెకండ్ ఇన్నింగ్స్‌లో కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ కేరీర్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆమె నటుడు నరేశ్‌తో కలిసి ఉండటం వల్ల హాట్‌టాపిక్‌గా మారారు. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, రిలేషన్షిప్లో ఉన్నారని ప్రచారం సాగింది. కానీ దీనిపై వారు క్లారిటీ ఇవ్వలేదు కానీ కలిసి మాత్రం తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓ సారి నరేశ్ మూడో భార్య వీరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి గొడవ చేయడం అంతటా చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి:ఫీల్‌గుడ్‌గా 'పంచతంత్రం' ట్రైలర్.. కీలక పాత్రలో బ్రహ్మానందం