తెలుగులో మంచి నటనతో తన గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నారు. అతడి నుంచి రాబోతున్న మరో చిత్రం 'దసరా'. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. ధూం.. ధాం.. దోస్తాన్.. అంటూ సాగే ఈ పాట శ్రోతల్ని ఆత్యంతం ఆకట్టుకుంటోంది. మంచి బీట్తో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటను మాస్ సింగర్ రాహుల్ సిప్లిగండ్ అద్భుతంగా పాడారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జంటగా అందాల రాసి కీర్తి సురేష్ నటిస్తోంది.
ఈ సినిమాలో సముద్ర ఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఎడిటర్ నవిన్ నూలి. 'దసరా' తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాచురల్ స్టార్ నాని నుంచి మంచి మాస్ ఎంటర్‌ట్రైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అచ్చమైన తెలంగాణ మాండలికంలో నాని అద్భుతంగా డైలాగులు చెప్పాడు. తెలంగాణ సంస్కృతి ఈ సినిమాలో ప్రతిబింబించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న విడుదల చేయనున్నారు.