Actor Nani Reacts On Jai Bhim Movie :కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులను గెలుచుకున్న నటీనటులకు నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే నాని షేర్ చేసిన మరో పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే?
2021లో రిలీజైన 'జై భీమ్' సినిమా కోలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. జస్టిస్ కే.చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య కీలక పాత్రలో నటించారు. భర్త ఆచూకీ తెలియక ఓ గిరిజన మహిళ పడే బాధలు.. అగ్రకులాల వారు చిన్న కులాల వారిని ఎలా అణిచివేతకు గురి చేస్తున్నారో ఈ సినిమాలో చూపించారు. అయితే అప్పట్లో ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించింది.
కాగా రీసెంట్గా కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో.. ఈ సినిమాకు ఏ కేటగిరిలోనూ పురస్కారం దక్కకపోవడం వల్ల పలువురు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో నాని కూడా.. ఈ సినిమా జాతీయ అవార్డును గెలుచుకోలేదని నిరాశ చెందినట్లు అర్థమవుతోంది. 'జై భీమ్' అని రాసి 'హార్ట్ బ్రేక్' ఎమోజీని ఇన్‌స్టాగ్రామ్‌లో నాని షేర్ చేశారు. అయితే ప్రస్తుతం నాని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హీరో నానీ ఇన్‌స్టా స్టోరీ.. రీసెంట్గా నానీ వ్యాఖ్యలు వివాదస్పదం..
మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన.. 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమా గురువారం విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఇటీవలెే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ స్టార్ హీరోలు రానా దగ్గుబాటి, నాని హాజరయ్యారు. ఇక కార్యక్రమంలో నాని.. "ప్రస్తుతం అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కానీ నాకు ఆ పదం నచ్చదు. కానీ రియల్ పాన్ ఇండియా స్టార్ మాత్రం దుల్కరే" అని అన్నారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ నానిపై ఫైరయ్యారు. అంతకుముందు సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో కూడా నాని కామెంట్లు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.