తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నడిరోడ్డుపై యువకుడితో హీరో నాగశౌర్య గొడవ.. ఓ అమ్మాయి కోసం! - hero naga shaurya news

టాలీవుడ్​ యంగ్​ హీరో నాగశౌర్య నడిరోడ్డుపై ఓ యువకుడితో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

naga shourya fight with young man
naga shourya fight with young man

By

Published : Feb 28, 2023, 4:40 PM IST

Updated : Feb 28, 2023, 6:29 PM IST

టాలీవుడ్​ యంగ్​ హీరో నాగశౌర్య నడి రోడ్డుపై ఓ యువకుడితో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రేయసిపై చేయి చేసుకుంటున్న ఘటనను చూసిన ఆయన వెంటనే కారు దిగి ఆ వ్యక్తిని మందలించేందుకు ప్రయత్నించారు. ఆ యువతికి సారీ చెప్పాలంటూ డిమాండ్​ చేశారు. అయితే చేయి చేసుకున్న వ్యక్తి.. ఆ అమ్మాయి తన గర్ల్​ఫ్రెండ్​ అంటూ బుకాయిస్తూ వచ్చాడు. దీంతో ఆగ్రహించిన శౌర్య.. గర్ల్​ఫ్రెండ్​ అయితే కొడతావా అంటూ కోప్పడ్డారు. ఈ సంఘటనతో అక్కడే గుమిగూడిన వారు సైతం నాగ శౌర్యకు మద్దతు పలుకుతూ ఆ వ్యక్తి.. ఆమెకు సారీ చెప్పాలంటూ డిమాండ్​ చేశారు. అయితే ఈ ఘటన హైదరాబాద్​లో ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు హీరో నాగ శౌర్యను ప్రశంసిస్తూ.. రియల్​ లైఫ్​లో కూడా ఇతను హీరోనే అంటూ పలువురు నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆయన చేసిన పనికి సామాజిక మాధ్యమాల వేదికగా షేర్​ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఇది నిజంగా జరిగిందా లేదా ఫ్రాంక్​ వీడియోనా, ఏదైనా మూవీ ప్రమోషన్స్​లో భాగమా అంటూ భిన్నాభిప్రయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇటీవలే తన చిరకాల ప్రేయసి అనుషా శెట్టి తో ఏడడుగులు వేసిన నాగశౌర్య.. ప్రస్తుతం తెలుగులో ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి అనే సినిమా షూట్​లో బిజీగా ఉన్నారు. ప్రముఖ ఆర్టిస్ట్​ కమ్​ డైరెక్టర్​ అవసరాల శ్రీనివాస్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' మూవీ బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్​ టాక్​ సాధించడంతో.. తాజా చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్​ చివరి దశలో ఉంది.

ఇప్పటికే రిలీజైన టీజర్​తో పాటు ఓ బ్రేకప్​ సాంగ్​.. సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ రెండూ కూడా సోషల్​ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు నాగశౌర్య రీసెంట్​ రిలీజ్​ కృష్ణ వృంద విహారి బాక్సాఫీస్​ వద్ద నిరాశ పరిచింది. అయితే కామెడి పరంగా సినిమా కాస్తా నెట్టుకు రాగలిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Last Updated : Feb 28, 2023, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details