Rocketry: "మనకు రెండు రకాల దేశభక్తులు ఉంటారు. బుల్లెట్లకి ఎదురొడ్డి జీవితాల్ని త్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్నవాళ్లు ఒకరైతే... అసలే గుర్తింపు లేకుండా జీవితాల్ని పణంగా పెట్టి దేశం కోసం పనిచేస్తున్నవాళ్లు మరొకరు. నంబి నారాయణన్ రెండో రకానికి చెందినవారు. ప్రపంచంలో మరే శాస్త్రవేత్తకి సాధ్యం కానంతగా చేశారు నంబి నారాయణన్. ఆయన ఏం చేశారనేది ఇందులో చూపించాం. ఆయన ఎదుర్కొన్న ఆరోపణలు, కేసుల కంటే ఆయన తన పరిశోధన జీవితంలో ఏం చేశారనే విషయాల్ని చూపించాం. జీవిత కథల్ని తెరకెక్కిస్తున్నప్పుడు మసాలా అంశాల్ని జోడించాల్సి ఉంటుంది. ఈ సినిమాకి ఆ అవసరమే రాలేదు. తెరపై చూపించిందంతా నిజం అని ప్రేక్షకుడు నమ్మితే చాలనుకుంటూ తీశా. అంత నాటకీయత ఉంటుంది నంబి నారాయణన్ జీవితంలో. తొలిసారి ఈ సినిమాలో రాకెట్ ఇంజిన్‌ని చూపించాం. పాత్రల్ని సహజంగా, ఎలాంటి ప్రాస్తెటిక్ మేకప్ లేకుండా చూపించే ప్రయత్నం చేశాం. నంబి నారాయణన్‌లా కనిపించేందుకు నా పంటి వరసని మార్చుకున్నా. పాత్రకి తగ్గట్టుగా బరువు పెరగడంతోపాటు, 18 రోజుల్లోనే ఆ బరువు తగ్గి నటించా".
"మొదట ఈ సినిమాకి నేను దర్శకత్వం వహించాలనుకోలేదు.ఈ కథ రాశాక 'నేనే దర్శకత్వం వహించడమా లేక, ఈ కథని ఇలా వదిలేయడమా?' అనే పరిస్థితి ఏర్పడింది. ప్రతీ నటుడు తమిళం, హిందీ, ఇంగ్లిష్... ఈ మూడు భాషల్లో మాట్లాడాలి. అలా మూడు భాషలు తెలిసిన నటుల్నే ఎంపిక చేసుకుని ఈ సినిమా చేశాం".