ప్రముఖ కన్నడ నటుడు దిగంత్ మంచాలే.. గోవాకు విహార యాత్రకు వెళ్లి.. సముద్ర తీరంలో విన్యాసాలు చేశాడు. ఆ విన్యాసాలు కాస్త అతడి ప్రాణం మీదకు తెచ్చాయి. తీవ్ర వెన్ను నొప్పి అతడిని బాధించింది. వెంటనే గోవా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడంతో తక్షణమే అక్కడి నుంచి అతడిని విమానంలో బెంగళూరుకు తరలించారు. నటుడిని పరిశీలించిన వైద్యులు.. శస్త్రచికిత్స చేసేందుకు ప్రక్రియకు మొదలు పెట్టామని తెలిపారు. గోవా సముద్ర తీరంలో ఫీట్స్ చేసిన కారణంగానే దిగంత్.. తీవ్రమైన వెన్నునొప్పికి గురైనట్లు తెలుస్తోంది.
నటుడి ప్రాణం మీదకు తెచ్చిన విన్యాసం.. విమానంలో ఆస్పత్రికి తరలింపు! - కన్నడ నటుడు దిగాంత్
సముద్ర తీరంలో చేసిన విన్యాసాలు.. ఓ యువ నటుడి ప్రాణం మీదకు తెచ్చాయి. వెంటనే అతడిని విమానంలో బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు.
దిగంత్ మంచాలే ప్రాణం మీదకు తెచ్చిన విన్యాసం
2006లో 'మిస్ క్యాలిఫోర్నియా' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం 'గాలిపాట 2', 'మారిగోల్డ్', 'ఎవరు', 'థిమయ్య అండ్ థిమయ్య' చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి: విజయ్ 'వారిసు' సెకండ్ లుక్.. 'రుద్ర కాళేశ్వరుడు'గా వైష్ణవ్ తేజ్