తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వైవిధ్య నటనతో చెరగని ముద్ర'- చంద్రమోహన్ మృతిపై చిరంజీవి సంతాపం - నటుడు చంద్రమోహన్ మృతి

Actor Chandramohan Passed Away : సీనియర్​ నటుడు చంద్రమోహన్​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ వేదికగా చంద్రమోహన్​కు సంతాపం తెలిపారు.

Actor Chandramohan Passed Away
Actor Chandramohan Passed Away

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 11:59 AM IST

Updated : Nov 11, 2023, 1:02 PM IST

Actor Chandramohan Passed Away : విలక్షణ నటుడు చంద్రమోహన్​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో మెగాస్టార్​ చిరంజీవి ట్విట్టర్​ వేదికగా చంద్రమోహన్​కు సంతాపం తెలిపారు.

"'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం. నా తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను." అంటూ సంతాపం తెలుపుతూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

ఇక జూనియర్​ ఎన్​టీఆర్​ కూడా చంద్రమోహన్​ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నానని తెలిపారు.

"ఆయన మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది"-సాయి ధరమ్‌ తేజ్‌

"విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" -కల్యాణ్‌ రామ్‌

సీనియర్ నటుడు చంద్రమోహన్​ కన్నుమూత

కొత్త హీరోయిన్ల లక్కీ స్టార్​ - ప్రతి పాత్ర చేయడానికి అదే కారణం!

Last Updated : Nov 11, 2023, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details