దాదాపు 1200 చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు చిత్రపరిశ్రమలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు చలపతిరావు. ఆయన నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అకస్మిక మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ఇప్పుడు డిసెంబరు 28న ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి. చలపతిరావు కుమారుడు రవిబాబు ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులతో పాటు చిత్రసీమకు చెందిన చెందిన పలువురు వ్యక్తులు హాజరయ్యారు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతో.. 1944 మే8న కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో జన్మించిన చలపతిరావు.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. నటుడు, నిర్మాతగా గుర్తింపు పొందారు. 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 1966లో విడుదలైన 'గూఢచారి 116' సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, కృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. 'కలియుగ కృష్ణుడు', 'కడప రెడ్డమ్మ', 'జగన్నాటకం', 'పెళ్లంటే నూరేళ్ల పంట'తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు.