తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మోహన్​బాబుతో గొడవ.. మరోసారి ఏడుస్తూ మాట్లాడిన బెనర్జీ - ACTOR BANARJEE OPEN HEART WITH RK

గతేడాది జరిగిన 'మా' ఎన్నికల్లో అనేక మలుపులు చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఆయనకు నటుడు మోహన్​బాబుకు మధ్య జరిగిన గొడవపై తాజాగా మాట్లాడారు సీనియర్​ నటుడు బెనర్జీ.

Actor banarjee open ups on MAA controversy
Actor banarjee open ups on MAA controversy

By

Published : Sep 2, 2022, 5:05 PM IST

Actor banarjee open ups on MAA controversy : గతేడాది జరిగిన మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగాయి. ఈ ఎలక్షన్స్​లో ప్రకాశ్​రాజ్​పై గెలిచిన విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తంగా ఈ ఎన్నికలు ఆద్యంతం వివాదాలతోనే ముగిసింది. అయితే ఎన్నికల సమయంలో మోహన్​బాబుతో జరిగిన గొడవపై తాజాగా మాట్లాడారు సీనియర్​ నటుడు బెనర్జీ.

'మోహన్ బాబు మీపై చేయి చేసుకున్నారా' అని అడిగిన ప్రశ్నకు ఆయన కళ్లు తుడుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదని ఇక మోహన్ బాబు విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేశానని చెప్పారు.కాగా, ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్​లోని తనీష్​ను మోహన్ బాబు తిట్టారని, ఆ సమయంలో తాను అక్కడికి వెళ్లి, గొడవలొద్దని విష్ణుతో చెప్పగా.. వెంటనే మోహన్ బాబు తనను కొట్టడానికి వచ్చారని బెనర్జీ అప్పట్లో అన్నారు. దాదపు అరగంటపాటు బూతులు తిడుతూనే ఉన్నారని చెప్పారు.40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను అలా తిట్టేసరికి షాక్ లో ఉండిపోయానని అప్పుడు కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details