తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'బింబిసార' డైరెక్టర్​తో బాలయ్య కొత్త సినిమా.. కథకు గ్రీన్​ సిగ్నల్​ కూడా ఇచ్చేశారట.. - తాప్సీ లేటెస్ట్ అప్డేట్స్

'వీరసింహారెడ్డి' షూట్​ తర్వాత నటసింహం బాలకృష్ణ మరో ప్రాజెక్ట్​కు సిద్ధమయ్యారట. ఈ క్రమంలో 'బింబిసార' డైరెక్టర్​కు ఆ మూవీ బాధ్యతలు అప్పజెప్పారట. ఇంతకీ ఆయన ఎవరంటే?

balakrishna
balakrishna

By

Published : Jan 8, 2023, 7:45 AM IST

కొత్త ప్రాజెక్టుల విషయంలో బాలకృష్ణ జోరు కొనసాగుతోంది. ఒక సినిమా చేస్తుండగానే, మరో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో సందడి చేయనున్న ఆయన, ఇప్పటికే అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాని పట్టాలెక్కించారు. ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ కూడా పూర్తయింది. తదుపరి ఆయన చేయాల్సిన సినిమాల జాబితా కూడా కాస్త పెద్దగానే కనిపిస్తోంది.

దీనికితోడు ఎప్పటికప్పుడు తనకున్న కొత్త ఆసక్తుల్ని కూడా బయటపెడుతున్నారు బాలకృష్ణ. 'వీరసింహారెడ్డి' వేడుకలో చెంఘీజ్‌ఖాన్‌ కథతో సినిమా చేయాలనుందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ దశలోనే ఓ కొత్త ప్రాజెక్ట్‌ తెరపైకొచ్చింది. 'బింబిసార'తో విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు వశిష్ఠ్‌ తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ విన్న బాలకృష్ణ తన అంగీకారం తెలిపారని సమాచారం. 'బింబిసార' సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందింది. బాలకృష్ణతోనూ వశిష్ఠ్‌ ఓ కొత్త రకమైన సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details