Acharya Trailer: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం 5.49కి థియేటర్లలో విడుదలైంది. దాదాపుగా 152 థియేటర్లలో 'ఆచార్య' మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ అదిరిపోగా.. థియేటర్లలో మెగా అభిమానులు సందడి చేశారు.
'ఆచార్య' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా అభిమానుల రచ్చ - పూజా హెగ్డే
Acharya Trailer: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమా ట్రైలర్ వచ్చేసింది. తొలుత ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేయగా.. అభిమానులు పండగ చేసుకున్నారు. యూట్యూబ్‌లోనూ వచ్చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
అయితే ట్రైలర్‌ను వీక్షించేందుకు మెగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లారు. ట్రైలర్లో చిరంజీవి చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేశాలను చూసి తెగ సంబరపడిపోతున్నారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో పెన్ స్టూడియోస్ ఆధ్వర్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హిందీ ట్రైలర్ కూడా విడుదల అవుతుందా? లేదా అన్న సందిగ్ధత నెలకొంది. చిత్ర బృందం సైతం దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోవడం వల్ల ఎప్పుడు విడుదల చేస్తారన్న ఆసక్తి మొదలైంది.
ఇదీ చూడండి:కేజీయఫ్‌కు వచ్చిన డబ్బులన్నీ వాళ్లకే ఇస్తా: ప్రశాంత్‌నీల్