తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నాన్నతో కలిసి నేను సినిమా చేయాలన్నది అమ్మ కల' - ఆచార్య ట్రైలర్​

మెగా హీరోలు చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్​ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా..​ చరణ్​, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొరటాల శివ.. చిరంజీవి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Acharya RAM CHARAN INTERVIEW
Acharya RAM CHARAN INTERVIEW

By

Published : Apr 20, 2022, 8:47 PM IST

Acharya Promotions: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న 'ఆచార్య'.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 29న ప్రేక్షకుల మందుకు రానుంది. కొరటాల- మెగాస్టార్‌ కాంబినేషన్ కావడం వల్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పాటలు, ట్రైలర్‌ అదిరిపోయినందున.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరంజీవితో పాటు మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఆచార్యకు డబుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా గడుపుతోంది. అందులో భాగంగానే హీరో రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

"ఆచార్య షూటింగ్‌ కోసం నెల రోజుల పాటు నాన్నతో కలిసి ఒకే ఇంట్లో ఉండటం, ప్రతిరోజూ కలిసి తినడం, షూటింగ్‌కు వెళ్లడం, ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయడం ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇక, ఆచార్య సినిమా షూటింగ్​ మొదలైనప్పుడు.. 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో అల్లూరి సీతారామరాజు గెటప్​లో ఉన్నాను. అందువల్ల ఆయన మధ్యలో మరో సినిమా చేయడానికి ఒప్పుకోరు. కానీ నాన్న.. నేను కలిసి తెరపై ఎక్కువసేపు కనిపించాలనే కోరిక అమ్మకి బలంగా ఉంది. అందువలన నాన్న రిక్వెస్ట్ చేయడం వల్ల రాజమౌళి కాదనలేకపోయారు. అసలు నాన్నతో కలిసి నేను సినిమా చేయాలన్నది మా అమ్మ కల. 'ఆర్​ఆర్​ఆర్​' లుక్​కి దగ్గరగా సిద్ధ పాత్ర ఉండటం లక్కీగా నాకు కలిసొచ్చింది."

-రామ్​చరణ్​, హీరో

చిరంజీవి సెట్స్ వదిలి వెళ్లేవారు కారు.. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ.. మెగాస్టార్​ చిరంజీవి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. "చిరంజీవి గారికి ఆచార్య సెట్ అంటే ఇష్టం. ఆయన సీనియర్ ఆర్టిస్ట్ గనుక, సాయంత్రం 4.40కి ప్యాకప్ చెప్పేవాడిని. మిగతా వాళ్లందరినీ 6:40కి పంపించేవాడిని. కానీ చిరంజీవి గారు అక్కడి నుంచి వెళ్లేవారు కాదు. అలా టీ తాగుతూ అక్కడే కూర్చునేవారు. అందరికీ ప్యాకప్ చెప్పిన తరువాతే ఆయన వెళ్లేవారు. అది ఆయన సినిమా పరిశ్రమకు ఇచ్చే గౌరవం. కాగా, మంచి ఫామ్​లో ఉన్నప్పుడు ఇద్దరూ తండ్రీకొడుకులు ఒకే సినిమాలో నటించడం.. భారతదేశంలో ఇదే తొలిసారి అనుకుంటా" అని కొరటాల శివ అన్నారు. ఇక అసలు ఇందులో సిద్ధ పాత్ర ఎలా వచ్చింది, మామూలుగా ఓ అతిథిగా ఉండాల్సిన ఈ పాత్ర.. ఫుల్‌ లెంత్​ క్యారెక్టర్‌గా ఎలా మారిందీ దర్శకుడు కొరటాల శివ వివరించారు. అసలు తాను ఈ సినిమా కేవలం చిరంజీవి కోసం మాత్రమే రాసుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో చరణ్‌ క్యారెక్టర్‌ను ఎలా చేర్చాల్సి వచ్చిందో కొరటాల చెప్పారు.

ఇవీ చదవండి:అదిరిన 'అర్జున కల్యాణం' ట్రైలర్​.. రామ్​- శింబు 'స్నీక్​ పీక్​' రిలీజ్

'హరిహర వీరమల్లు' క్రేజీ బజ్​.. ఓటీటీలోకి 'గంగూబాయి'

ABOUT THE AUTHOR

...view details