Acharya Movie Laahe Laahe Song Promo: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి 'లాహే లాహే' గీతం ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్న 'లాహే లాహే' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ప్రోమోలో చిరంజీవి, నటి సంగీత స్టెప్పులు, హావభావాలు అదిరాయి.
Sarkaru Vaari Paata Latest Update: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా, మహేశ్ బాబు ఫోటోను రిలీజ్ చేస్తూ లేటెస్ట్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పార్ట్ పూర్తయిందని చిత్రబృందం అధికారికంగా తెలిపింది. కొత్త పోస్టర్లో మహేశ్ లుక్ అదిరిపోయింది. ఈ మూవీని మే12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
Vikram Cobra Movie Song Release: విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే నటుడు విక్రమ్. తమిళ హీరోనే అయినా తెలుగులో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్టు సాధించని విక్రమ్‌కు 'మహాన్' మంచి కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ మూవీ 'కోబ్రా'. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. ఎప్పుడో ప్రారంభమైన షూటింగ్ ఇటీవలే పూర్తయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే25న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'అధీరా' లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.