Chiranjeevi twitter name: ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2020లో ట్విటర్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. ఆ వేదికగా తన తదుపరి సినిమా అప్‌డేట్స్, నాటి మధుర జ్ఞాపకాలు పోస్ట్ చేయడం వంటివి చేస్తుంటారు. పలు విషయాలపై ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తుంటారు. కాగా, తాజాగా ఆయన తన ట్విటర్ ఖాతా పేరు మార్చుకున్నారు. 'చిరంజీవి'కి బదులు 'ఆచార్య'గా ఖాతా పేరు మార్చారు. చిరు చేసిన ఈ పనితో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన తదుపరి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే చిరు ఇలా చేశారని చెప్పుకొంటున్నారు.
ట్విటర్ ఖాతా పేరు మార్చుకున్న చిరు.. కారణమిదే? - చిరంజీవి ట్విట్టర్ పేరు
Chiranjeevi twitter name: మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి త్వరలోనే 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చుకున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు మార్చారు? కొత్త పేరు ఏం పెట్టారు? తెలుసుకుందాం..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఆచార్య'. దేవాలయాల ప్రాముఖ్యత, వాటిలో జరిగే అవినీతి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈసినిమాలో ఆచార్యగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. రామ్‌చరణ్.. సిద్ధగా కీలకపాత్ర పోషించారు. కాజల్, పూజాహెగ్డే కథానాయికలు. కొరటాల శివ తెరకెక్కించిన ఈసినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే 'ఆచార్య' టీమ్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. అలాగే ఈ నెల 18న 'భలే భలే బంజారా..' అంటూ సాగే పాటని కూడా విడుదల చేయనున్నారు. మణిశర్మ స్వరకల్పనలోని ఈ గీతంలో చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నృత్యాలతో చేయనున్న సందడి సినిమాకి ఆకర్షణగా నిలుస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సురేఖ కొణిదెల సమర్పకులు.
ఇదీ చూడండి: దేవీశ్రీకి బంఫర్ ఆఫర్.. సల్మాన్‌ఖాన్‌తో మరోసారి!