తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'భలే భలే బంజారా' ఫుల్​ సాంగ్ .. కేక పుట్టించిన చిరు- చరణ్ - 'భలే భలే బంజారా' ఫుల్​ సాంగ్​

Acharya Bale Bale Bhanjara Full Song: 'ఆచార్య'​ సినిమా నుంచి ఫ్యాన్స్​ ఎదురుచూసిన 'భలే భలే బంజారా' పూర్తి సాంగ్ వచ్చేసింది. ఇందులో చిరు, చరణ్​లు స్టెప్పులు అదిరిపోయాయి. ఆ పూర్తి సాంగ్​ను మీరూ చూసేయండి.

Acharya bale bale bhanjara song release
Acharya bale bale bhanjara song release

By

Published : Apr 18, 2022, 5:21 PM IST

Acharya Bale Bale Bhanjara Full Song: మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్​ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఆచార్య'. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి 'భలే భలే బంజారా' పూర్తి గీతాన్ని విడుదల చేసింది మూవీ టీమ్. ఇప్పటికే చిరంజీవి, రామ్​చరణ్​​ సంభాషణతో కూడిన టీజర్ వీడియో, గ్లింప్స్​ రిలీజ్ చేసిన చిత్రబృందం.. సోమవారం సాయంత్రం పూర్తి పాటను విడుదల చేసింది. పాటలో చిరంజీవి, రామ్​చరణ్​ స్టెప్పులతో అదరగొట్టారు. చిరు గ్రేస్.. సాంగ్​కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి హావభావాలు అదిరిపోయాయి.

'భలే భలే బంజారా' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా.. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. రామ్​చరణ్, చిరంజీవి కలిసి ఒకే పాటకు పూర్తి స్థాయిలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి చరణ్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్​ అవ్వనుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details