బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, స్టార్ నటి ఐశ్వర్యరాయ్‌ను హగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఇటీవలే జరిగిన ప్రో కబడ్డీ ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యతో కలిసి పాల్గొన్నారు అభిషేక్. తొమ్మిదో సీజన్‌లో అభిషేక్ టీమ్ జైపుర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీమ్ గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయారు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
'ఆ రూమర్లకు వీడియోతో చెక్'.. పట్టలేని సంతోషంలో ఐష్‌ను హగ్ చేసుకున్న అభిషేక్ - ఐశ్వర్య హగ్ అభిషేక్
ప్రో కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్‌లో తన టీమ్ గెలవడంతో అభిషేక్ బచ్చన్ ఆనందంలో మునిగిపోయారు. పట్టలేని సంతోషంలో పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్దిరోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం ఐశ్వర్య కూడా భర్తకు చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న రూమర్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఐశ్వర్య రాయ్, అభిషేక్‌లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో ఆరాధ్య జన్మించింది.