తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్లీజ్​ నా సినిమా బాయ్​కాట్​ చేయొద్దు: స్టార్​ హీరో ఆవేదన - బాయ్​కాట్​ లాల్​ సింగ్​చడ్డా బాయ్​కాట్​

Boycott Laal singh chaddha: తన చిత్రాన్ని ఎవరూ బాయ్‌కాట్‌ చేయొద్దని బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. దేశభక్తి విషయంలో అందరూ తనని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని అన్నారు.

boycott Laal singh chaddha
లాల్​ సింగ్​ చడ్డా బాయ్​కాట్​

By

Published : Aug 1, 2022, 4:38 PM IST

Boycott Laal singh chaddha: తన చిత్రాన్ని ఎవరూ బాయ్‌కాట్‌ చేయొద్దని బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ అన్నారు. దేశభక్తి విషయంలో అందరూ తనని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని, తాను భారతదేశాన్ని గౌరవిస్తున్నానని ఆమిర్‌ అన్నారు. తాను హీరోగా నటించిన 'లాల్‌సింగ్‌ చడ్డా'కు వ్యతిరేకంగా సోష్‌ల్‌మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్‌ స్పందించారు. "నాపై, నా సినిమాపై ప్రతికూల ప్రచారం జరుగుతున్నందుకు బాధగా ఉంది. నాకు భారత్‌ అంటే ఇష్టం లేదని కొంతమంది అనుకుంటున్నారు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. నేను దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు చెప్పేది ఒక్కటే.. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు. నా గురించి అటువంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బాయ్‌ కాట్‌ చేయొద్దు" అని చెప్పుకొచ్చారు.

హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా 'లాల్‌ సింగ్‌ చడ్డా' సిద్ధమైంది. ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. కరీనా కపూర్‌ కథానాయిక. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఆయన సినిమాని బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు.. 'బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌చడ్డా' అని వరుస పోస్టులు పెడుతున్నారు.

ఇదీ చూడండి: 'కార్తికేయ 2' రిలీజ్​ చేయొద్దని హెచ్చరించారు: నిఖిల్​

ABOUT THE AUTHOR

...view details