బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆమిర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకలు జరుపుకుంటుండగా.. గుండెపోటుతో జీనత్ కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ముంబైలోని పంచగని నివాసంలో ఆమిర్ ఖాన్ కుటుంబం దీపావళి వేడుకల్లో ఉండగా.. ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం జీనత్ పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్‌సింగ్ చద్దా' ఇటీవలే విడుదల అయ్యింది. ఇందులో ఆమిర్ సరసన కరీనా కపూర్ నటించారు. తెలుగు యువ నటుడు అక్కినేని నాగచైతన్య కూడా ఇందులో ఓ కీలక ప్రాత్ర పోషించారు. బాయ్‌కాట్ సెగతో అనుకున్నంతగ స్థాయిలో ఆడలేకపోయింది ఈ సినిమా.
ఆమిర్ ఖాన్ తల్లికి గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు - ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్‌కు గుండెపోటు
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తల్లికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..
Aamir Khan mother Zeenat Hussein heart attack