తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగాస్టార్​ ఇంట్లో 'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు - aamir khan laal singh chaddha preview

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ న‌టించిన‌ 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేపథ్యంలో టాలీవుడ్​ ప్రముఖుల కోసం.. ఆమిర్‌ఖాన్‌ మిత్రుడు మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు ఆమిర్​ఖాన్​.

Aamir Khan arranges Laal Singh Chaddha premiere in Hyderabad. Rajamouli, Nagarjuna and Chiranjeevi attend
మెగాస్టార్​ ఇంట్లో 'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు

By

Published : Jul 14, 2022, 7:26 PM IST

బాలీవుడ్‌ స్టార్​ హీరో ఆమిర్‌ఖాన్‌, మెగాస్టార్ చిరంజీవి మంచి స్నేహితులు. చాలా ఏళ్లుగా వీరి స్నేహ బంధం కొనసాగుతోంది. అయితే ఆమిర్‌ఖాన్‌ న‌టించిన‌ 'లాల్​ సింగ్​ చద్ధా' సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తన మిత్రుడు మెగాస్టార్​ చిరంజీవితోపాటు.. ఇతర టాలీవుడ్​ ప్రముఖుల కోసం ప్రివ్యూ వేశారు ఆమీర్​.

చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ జరగ్గా.. ప్రత్యేక అతిథులుగా కింగ్ నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, స్టార్​ డైరెక్టర్లు ఎస్ఎస్.రాజమౌళి, సుకుమార్ హాజరై వీక్షించారు. చూసిన ప్రముఖులంతా.. సినిమా ప‌ట్ల ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌ తెరకెక్కించారు. కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

'లాల్​ సింగ్​ చద్ధా' ప్రత్యేక ప్రివ్యూ.. హాజరైన టాలీవుడ్​ ప్రముఖులు

ఇదీ చదవండి:జబర్దస్త్ ఫైమా సొంతింటి కల సాకారం.. రింగు తొడిగి ప్రవీణ్ ప్రపోజల్!

ABOUT THE AUTHOR

...view details