తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లైగర్​ నుంచి మరో పాట.. ఈ ఏడాది 'మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌' ఇదే! - లైగర్ అప్​డేట్స్

Aafat song liger: విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' నుంచి మరో పాట విడుదలైంది. 'ఆఫత్‌' అంటూ సాగే పాట ఫుల్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. "మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌"గా అభివర్ణించారు విజయ్‌.

aafat song liger
aafat song liger

By

Published : Aug 6, 2022, 11:01 AM IST

Aafat song liger: విజయ్‌ దేవరకొండ అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఆయన హీరోగా నటించిన 'లైగర్‌' నుంచి మరో పాట విడుదలైంది. 'ఆఫత్‌' అంటూ సాగే ఈ పాటలో విజయ్‌ దేవరకొండ-అనన్యపాండేల కెమిస్ట్రీ యువతను ఆకర్షించేలా ఉంది. ఈ పాట ఫుల్‌ వీడియోని షేర్‌ చేస్తూ.. "మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌"గా విజయ్‌ అభివర్ణించారు. "బాబోయ్‌ మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్కలేసుకుని నువ్వు బకరా అని ఫిక్స్‌ అయినక నంబర్‌ ఇస్తయ్‌. ఇక, వాట్సాప్‌లు షురూ ఐతై చూడు.. నిద్రపోనివవ్వు.. పనులు చేసుకోనివవ్వు.. బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే" అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌లతో మొదలైన ఈ పాటలో నటీనటులు తమ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు.

ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో 'లైగర్‌' సిద్ధమవుతోంది. అందుకే ఈ సినిమాలోని పాటలు, సంభాషణల్లో హిందీ ఎక్కువగా వినిపిస్తుంది. ఇక, కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌ ముంబయి మురికివాడకు చెందిన చాయ్‌వాలాగా కనిపించనున్నారు. ఆయనకు తల్లి పాత్రలో రమ్యకృష్ణ మెప్పించనున్నారు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. కరణ్‌ జోహార్‌, ఛార్మి నిర్మాతలు.

ABOUT THE AUTHOR

...view details