Fan threatens Sonakshi sinha: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు వింత అనుభవం ఎదురైంది. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మను అక్కడే ఉన్న ఓ అభిమాని పెళ్లి చేసుకోమని బెదిరించాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
హీరోయిన్ బాత్రూమ్లో దూరిన అభిమాని.. పెళ్లి చేసుకోవాలంటూ.. - సోనాక్షి సిన్హా బాత్రూమ్లో దూరిన ఫ్యాన్
Fan threatens Heroine: ఓ స్టార్ హీరోయిన్ను కలిసేందుకు ఆమె బాత్రూమ్లో దూరాడు ఓ అభిమాని. రాత్రంతా అందులోనే గడిపాడు. అనంతరం ఆమెకు ప్రపోజ్ చేసి, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో ఆ కథానాయిక భయబ్రాంతికి గురైంది.
ఇంతకీ ఏం జరిగిందంటే?.. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి.. తన వ్యానిటీ వ్యాన్లో ఫోన్ చూసుకుంటూ ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి ఆమె అభిమాని అంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసమే రాత్రి నుంచి ఇక్కడే ఎదురుచూస్తున్నా' అంటూ.. సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన సోనాక్షి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా సదరు అభిమాని అక్కడ గందరగోళం సృష్టించాడు. అద్దంపై లిప్స్టిక్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని అన్నాడు. అంతేకాకుండా కత్తిని మెడపై పెట్టుకొని పెళ్లి చేసుకోవాలని ఆమెను బెదరించాడు. దీంతో షాక్కు గురైన సోనాక్షి కేకలు వేయగా ఈ షో ప్రోమో వీడియో ముగిసింది. అయితే ఇదంతా ప్రాంక్ అని ఆ తర్వాత సోనాక్షికి తెలిసింది.
ఇదీ చూడండి:'కేజీయఫ్-2'లో నా పాత్ర ఎంతో కీలకం: శ్రీనిధి