90s Middle Class Biopic OTT : ఓటీటీలో సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు విపరీతమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు థియేటర్స్‌లో సినిమాలు చూస్తూనే మరోవైపు ఓటీటీలోనూ సినిమాలను, సిరీస్‌లను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఆడియెన్స్ కోసం ఓటీటీ సంస్థలు ఎన్నో కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి. వారి అభిరుచికి తగ్గట్లుగా కామెడీ, థ్రిల్లర్, ఎమోషనల్ సిరీసులు, సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి. అయితే రీసెంట్గా బిగ్‌బాస్‌తో మళ్లీ వెలుగులోకి వచ్చిన హీరో శివాజీ(shivaji 90s web series ott platform) ఇటీవల ఓ కామెడీ ఎమోషనల్ డ్రామా సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
హ్యాష్ ట్యాగ్ 90S ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈటీవీ విన్లో ఈ సిరీస్ రిలీజ్ అయిన తొలి రోజు నుంచే విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఓటీటీలో పుల్ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ సిరీస్‌లో అప్పటి జనరేషన్ పిల్లలు, తల్లి తండ్రులు, అప్పటి పరిస్థితులను చాలా చక్కగా చూపించారు దర్శకుడు. చక్కటి ఎమోషన్స్, మ్యూజిక్, ఆకట్టుకునే సంభాషణలతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ చూసే విధంగా దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ఓ అరుదైన రికార్డ్‌ను అందుకుంది. 120+ మిలియన్ మినిట్స్ వ్యూస్ సొంతం చేసుకుని సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఈటీవీ విన్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.