తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు విశేష స్పందన- 'ETV WIN​'లో రికార్డ్స్ బ్రేక్! - శివాజీ న్యూ వెబ్​సిరీస్

90's A Middle Class Biopic Etv Win:బిగ్​బాస్ ఫేమ్ శివాజీ లీడ్ రోల్​లో నటించిన '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్​సిరీస్​ ప్రస్తుతం ట్రెండింగ్​లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ వెబ్​సిరీస్​ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫ్లామ్​ 'ఈటీవీ విన్​'లో స్ట్రీమింగ్ అవుతోంది.

90's A Middle Class Biopic Etv Win
90's A Middle Class Biopic Etv Win

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 7:57 PM IST

Updated : Jan 9, 2024, 9:44 AM IST

90's A Middle Class Biopic Etv Win:టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ కీ రోల్​లో నటించిన '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్​సిరీస్ జనవరి 5నుంచి 'ఈటీవీ విన్' ఓటీటీ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య హాసన్ ఈ వెబ్​సిరీస్​కు దర్శకత్వం వహించారు. ఇంటర్నెట్, టెక్నాలజీతో ఇప్పటితరం పిల్లలు స్మార్ట్​గా గడిపేస్తున్నారు. అయితే 1990ల్లో స్మార్ట్​ ఫోన్ల వినియోగం అంతగా లేని అప్పటి జీవితాల్ని '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో(90s web series Ott) అద్భుతంగా చూపించారు.

మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కామెడీ, ఎమోషన్స్, కుటుంబ విలువలు కలబోసి మొత్తం ఆరు ఎపిసోడ్​లతో ఉన్న ఈ సిరీస్​ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్​లో ఉంది. గత మూడు రోజుల నుంచి ఈ సిరీస్ ఈటీవీ విన్​లో టాప్​ ప్లేస్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్ 80+ మిలియన్​ మినిట్స్ వ్యూస్ సొంతం చేసుకుంది.

సోషల్ మీడియాలో సైతం '90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు విశేష స్పందన లభిస్తోంది. కుటుంబమంతా కలిసి చూడాల్సిన వెబ్​సిరీస్​ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చింది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, 'తప్పక చూడాల్సిన వెబ్​ సిరీస్​ ఇది' అంటూ సోషల్ మీడియా యూజర్ అభిప్రాయపడ్డారు.

90's A Middle Class Web Series where to watch:ఈటీవీ విన్​లో స్ట్రీమింగ్​ అవుతున్నఈ వెబ్​సిరీస్​లో శివాజీతోపాటు వాసుకీ ఆనంద్ సాయి, మౌళి, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. ఓ మిడిల్​క్లాస్​ ఫ్యామిలీ యజమాని చిన్న స్కూళ్లో లెక్కల మాస్టారు. తన ముగ్గురు పిల్లల చదువు విషయంలో కఠినంగా ఉండే అతడు వారిని ప్రైవేటు స్కూల్​లో చేర్పిస్తాడు. పిల్లలు మంచి ర్యాంకులు సాధించాలనుకునే తండ్రి ఆశలకు అనుగుణంగా రాణించారా? మధ్య తరగతి కుటుంబంలో పిల్లలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ర్యాంకుల కోసం ప్రైవేటు స్కూల్స్‌ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తెస్తున్నాయి? ఈ అంశాలన్నింటికీ ఒక్క వెబ్​సిరీస్​లో సమాధానం చెప్పారు డైరెక్టర్ ఆదిత్య హాసన్.

OTT లవర్స్​కు​ సరికొత్తగా ETV WIN.. 'ఒక్క రూపాయి'కే బ్లాక్ బాస్టర్​ సినిమాలు, సిరీస్​లు

ఈటీవీ విన్​లో 'మిడిస్‌ క్లాస్‌ బయోపిక్‌' నవ్వులు పంచుతోందిగా!

Last Updated : Jan 9, 2024, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details