Lingusamy cheque bounce case: తమిళ దర్శకుడు లింగుస్వామికి న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఓ స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇదీ జరిగింది..హీరో కార్తిక్, హీరోయిన్ సమంతతో 'యెన్ని ఏలు నాల్' సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేసింది తిరుపతి బ్రదర్శ్ ప్రొడక్షన్స్. దీనికి లింగుస్వామి దర్శకుడు. అయితే సినిమా అవసరాలకు పీవీపీ ఫైనాన్స్ అనే కంపెనీ నుంచి కోటి 35 లక్షలు అప్పుగా తీసుకుని తిరుపతి బ్రదర్స్ నిర్మాతలకు ఇచ్చారు లింగుస్వామి.
స్టార్ దర్శకుడికి షాక్, ఆరు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
దర్శకుడు లింగుస్వామికి కోర్టులో చుక్కెదురైంది. చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎందుకంటే.
ఆ తర్వాత రూ. 35లక్షలను పీవీపీ ఫైనాన్స్‌కు చెక్ ద్వారా చెల్లించారు. కానీ ఆ చెక్ బౌన్స్ అయింది. దీంతో సదరు కంపెనీ.. ఆయనపై కోర్టులో కేసు వేసింది. దీనిని విచారించిన చెన్నైలోని సైదాబాద్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ.. తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. లింగుస్వామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించనున్నారని తెలిసింది.
కాగా, లింగుస్వామి టాలీవుడ్ నటుడు రామ్ పోతినేనితో ది వారియర్ చిత్రాన్ని తెరకెక్కించారు. కృతిశెట్టి కథానాయిక. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. జులై 14న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ చిత్రంలో విలన్ ఆది పినిశెట్టి- హీరో రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.