తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హనుమాన్​'కు సూపర్ క్రేజ్​ - ఇక ఆ రెండు సినిమాలకు రిస్కే!

2024 Sankranthi Movies : ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి ఎన్నో టాలీవుడ్​ సినిమాలు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందులో అగ్ర తారల సినిమాల నుంచి యంగ్ హీరోల మూవీ​ కూడా పోటీకి సిద్ధంగా ఉంది. అయితే చిన్న సినిమానే కదా అని తేలిగ్గా తీసుకోలేమంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే 'హనుమాన్​'కు ఉన్న జోరు చూస్తుంటే మిగతా రెండు సినిమాలకు గట్టి దెబ్బే తలిగేటట్లు ఉండనుందట. అదేంటంటే ?

Etv Bharat2024 Sankranthi Movies
2024 Sankranthi Movies

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 11:52 AM IST

2024 Sankranthi Movies :ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్​ వద్ద ఎన్నో సినిమాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి. అందులో మహేశ్ 'గుంటూరు కారం', వెంకటేశ్ 'సైంధవ్', తేజ సజ్జా 'హనుమాన్​'తో పాటు నాగార్జున 'నా సామి రంగ' సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. అయితే అభిమానుల కళ్లంతా 'గుంటూరు కారం', 'హనుమాన్​' సినిమాలపైనే ఉన్నాయి.

ముఖ్యంగా 'హనుమాన్' గురించి నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ముగ్గురు పెద్ద హీరోల సినిమాల మధ్య ఈ చిన్న స్టార్ చిత్రం రావడం వల్ల అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అయితే హీరో, డైరెక్టర్ చిన్నవాళ్లే అని అనుకుని సినిమా రేంజ్​ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదంటూ సినీ విశ్లేషకులు కితాబులిస్తున్నారు. ప్రముఖ టికెట్​ బుక్కింగ్ యాప్​లో 'బుక్ మై షో'లో ఉన్న సంక్రాంతి సినిమాలన్నింట్లోకి ఈ చిత్రం ఇప్పటివరకు అత్యధిక ఇంటరెస్ట్స్ సంపాదించడమే కాకుండా అడ్వాన్స్ బుకింగ్స్​లోనూ చూపిస్తున్న జోరు చూస్తే హనుమాన్ రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తుండగా ఆ రోజుకు పెట్టిన షోలు ఇప్పటికే సోల్డ్​ అవుట్​ అయిపోతున్నాయి. దీంతో 'హనుమాన్' సినిమాను ఎంత మాత్రం తక్కువ అంచనా వేయలేమని అందరి మాట. అయితే గుంటూరు కారం బ్యాక్​గ్రౌండ్ వేరు కాబట్టి దానికి 'హనుమాన్' చిత్రం నుంచి అంతా ముప్పు లేకపోవచ్చు. కానీ సంక్రాంతి బరిలో ఉన్న మిగతా రెండు సినిమాలకు మాత్రం ఈ సినిమా నుంచి ప్రమాదం పొంచి ఉందని సినీ వర్గాల టాక్.

సంక్రాంతి సినిమాల్లో ఆడియెన్స్ ఫస్ట్ ఛాయిస్​ 'గుంటూరు కారం' అని టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మేజర్ స్క్రీన్లు దక్కాయి. దీంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రానున్నాయని, ఇక తర్వాతి రెండు రోజుల్లో ఉన్న థియేటర్లలో బాగా ఆడితే ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటుతుందని ట్రేడ్ వర్గాల సమాచారాం.

అయితే 'సైంధవ్','నా సామి రంగ' సినిమాల విషయం అలా కాదు. ప్రస్తుతానికి 'గుంటూరు కారం' తర్వాత ప్రేక్షకుల నెక్స్ట్​ ఛాయిస్ 'హనుమాన్' లాగే కనిపిస్తోంది. ఇప్పటికే మంచి ఆక్యుపెన్సీ సాధించిన ఈ సినిమాకు తొలి రోజు మంచి టాక్ వస్తే ఇక ఆ ఎఫెక్ట్ 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలపై ఖచ్చితంగా పడుతుందని టాక్. వాటికి మామూలుగానే ఓపెనింగ్స్ పెద్దగా వచ్చేలా కనిపించడం లేనందున. సంక్రాంతికి ముందుగా వచ్చే ఈ రెండు సినిమాలను చూశాకనే ప్రేక్షకులు వీటి వైపు ఎంత మేర మళ్లుతారన్నది ప్రశ్న. చూడాలి మరీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలకు పోటీ ఎలా ఉండనుందో ?

'హనుమాన్'​ ప్రీమియర్ షోస్ టికెట్స్​​ - ఊహించని విధంగా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!

సంక్రాంతి సినిమాల రన్​టైమ్​ - ఇందులో కూడా మహేశే టాప్​!

ABOUT THE AUTHOR

...view details