2024 Sankranthi Movies : ఈ సారి సంక్రాంతి 2024 పండగ బరిలో 6 సినిమాలు దిగుతున్నాయి. 'గుంటూరు కారం', 'సైంధవ్', 'నా సామిరంగ', 'హనుమాన్' చిత్రాలే కాకుండా తమిళ డబ్బింగ్ చిత్రాలైన 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' కూడా బరిలో ఉన్నాయి. ఈ చిత్రాలను థియేటర్లలో చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అన్ని పెద్ద సినిమాలే కావడం వల్ల థియేటర్స్ కొరతతో ప్రస్తుతం పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇదే సమయంలో ఈ చిత్రాల ఓటీటీ రిలీజ్ వివరాలను కూడా వెతికేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సంక్రాంతి సినిమాల ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి.
Gunturu Kaaram OTT Release : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా - త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరామ్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ ధరకు విక్రయించిందని టాక్ నడుస్తోంది.
Hanuman Movie OTT Release : ప్రశాంత్ వర్మ - తేజ సజ్జ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. దాదాపు 11 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థం జీ5 దక్కించుకుంది. శాటిలైట్ రైట్స్ కూడా జీ5 దక్కించుకున్నట్లు సమాచారం.