2024 Release Tollywood Movies :2023 మొదటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ ముందు ఎన్నో సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. అందులో భారీ బడ్జెట్, లో బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే అందులో కొన్ని మాత్రమే విజయ తీరాలకు చేరుకోగా, కొన్నింటికీ మాత్రం నిరాశే మిగిలింది. అయితే అభిమానులు మాత్రం రానున్న సినిమాల గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
న్యూ ఇయర్‌కు ఇంకొద్ది రోజులే ఉందన్న తరుణంలో మూవీ లవర్స్‌కు సలార్ సినిమా సూపర్ ట్రీట్ ఇచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ అంతకింత సక్సెస్ అందుకుని దూసుకెళ్తోంది. ఇక ఇదే నెలలో (డిసెంబర్ 29)న నందమూరి కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే అదే రోజు రోషన్ కనకాల లీడ్ రోల్లో తెరకెక్కిన 'బబుల్ గమ్' కూడా థియేటర్లలోకి రానుంది. ఇలా 2023 రెండు మీడియం రేంజ్ బడ్జెట్ మూవీస్‌తో ముగియనుంది.
మరోవైపు సంక్రాంతి కానుకగా రిలీజయ్యేందుకు రేసులో భారీగా లైనప్ ఉంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం', నాగార్జున 'నా సామి రంగ', రవితేజ 'ఈగల్' ఇలా పలు స్టార్స్ తమ సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక తేజ సజ్జ 'హనుమాన్' మూవీ కూడా జనవరి 12న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇలా జనవరి మొత్తం ఫుల్ జోష్‌గా నడవనుంది.