2024 Pan India Movies :2023 పలు పాన్ఇండియా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అందులో 'ఆదిపురుష్', 'జైలర్', 'లియో', 'సలార్ పార్ట్-1' భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్నాయి. అటు బాలీవుడ్ కూడా సౌత్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే 'జవాన్', 'పఠాన్', 'యానిమల్' సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ఈ క్రమంలో 2024లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న పాన్ఇండియా సినిమాలేంటో చూసేద్దాం.
పుష్ప ది రూల్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప ది రైజ్' బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప ది రూల్ రూపొందుతోంది. షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2024 ఆగస్టు 15న రిలీజ్ కానున్నట్లు మూవీయూనిట్ ఇదివరకే ప్రకటించింది.
కల్కి 2898AD: 'సలార్ పార్ట్-1'తో బాక్సాఫీస్ రికార్డులు బద్దులుకొడుతున్న రెబల్ స్టార్ ప్రభాస్, 2024లో 'కల్కి 2898AD' సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ తదితరులు నటిస్తున్నారు. మరో 100 రోజుల్లోపే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు నాగ్ అశ్విన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.