తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కలెక్షన్ల సునామీ సృష్టించిన 'బార్బీ' - రూ.10 వేల కోట్ల వసూళ్లు - ఈ ఏడాది టాప్ 5 చిత్రాలివే! - 10 వేల కోట్ల కలెక్షన్స్ సినిమా

2023 Top 5 Highest Box Office Collection : ప్రపంచవ్యాప్తంగా అనేక భారీ బడ్జెట్ సినిమాలు ఈ ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో హిట్​టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా.. అత్యధిక వసూళ్లూ సాధించాయి. మరి ఈ ఏడాది.. కాసుల వర్షం కురిపించిన టాప్ 5 సినిమాలేవంటే?

boxoffice collections 2023
boxoffice collections 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 8:01 AM IST

2023 Top 5 Highest Box Office Collection : 2023 సంవత్సరం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక సినిమాలు విడుదల కాగా.. వాటిలో కొన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులను నమోదు చేయగా.. మరికొన్ని మంచి కంటెంట్​తో విజయం నమోదుచేశాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

  1. బార్బీ
    హాలీవుడ్ సినిమా 'బార్బీ'.. జూలై 21న రిలీజై.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు వసూళ్లు చేసిన సినిమాల జాబితాలో బార్బీ.. టాప్​లో నిలిచింది. ఈ క్రమంలో బార్బీ , ప్రపంచవ్యాప్తంగా 1.38బిలియన్ డాలర్లు వసూల్ చేసింది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు నటించారు.
  2. సూపర్ మారియో బ్రోస్
    బార్బీ తర్వాత ఈ ఏడాది ఎక్కువ వసూళ్లు చేసిన సినిమా 'సూపర్ మారియో బ్రోస్'. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.35 బిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించిది. ఈ సినిమాలో అన్య టేలర్-జాయ్, క్రిస్ ప్రాట్, జాక్ బ్లాక్ మరియు సేథ్ రోజెన్ లు నటించారు.
  3. ఓపెన్ హైమర్
    ప్రముఖ అమెరికన్ ఫిజిస్ట్ రాబర్ట్ కథ ఆధారంగా.. 'ఓపెన్ హైమర్' తెరకెక్కింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అటామిక్ బాంబు తయారు చేయడంలో ఆపెన్ హైమర్ పాత్రను ఇందులో చూపించారు. బార్బీ రిలీజైన అదే వారంలో ఈ సినిమా కూడా థియేటర్లకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 853మిలియన్ డాలర్లు వసూల్ చేసింది.
  4. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ, వోల్యూమ్ 3
    గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వోల్యూమ్ 3.. ప్రపంచవ్యాప్తంగా 845 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో క్రిస్ ప్రాట్, చుక్​వుడి ఇవుజి, బ్రాడ్​లే కూపర్ కీలక పాత్రలో నటించారు.
  5. ఫాస్ట్ ఎక్స్
    హాలీవుడ్ స్టార్ విన్ డిజిల్ కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా ఫాస్ట్​ ఎక్స్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను.. ఫాస్ట్​ ఎక్స్ ఎంతగానో అలరించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 704 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వసూల్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details