Will Smith Banned For Ten Years: ప్రముఖ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్‌పై మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకుంది. పదేళ్లపాటు ఆస్కార్ అవార్డు వేడుకలతో పాటు ఇతర అకాడమీ అవార్డుల ఫంక్షన్లలోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం విధించింది. ఆస్కార్ వేడుకలో విల్ స్మిత్ వ్యవహరించిన శైలిని మోషన్ పిక్చర్ అకాడమీ తప్పుపట్టింది. మరోవైపు ఈ నిర్ణయంపై స్మిత్ స్పందించారు. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు స్మిత్ రాజీనామా చేశారు.
విల్ స్మిత్‌పై చర్యలు.. పదేళ్ల పాటు ఆస్కార్ వేడుకలకు నో ఎంట్రీ - మోషన్ పిక్చర్స్ అకాడమీ
Will Smith Banned For Ten Years: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో కమెడియన్ క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటుడు విల్ స్మిత్‌పై మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకుంది. పదేళ్ల పాటు ఆస్కార్ అవార్డులతో పాటు ఇతర అకాడమీ అవార్డుల వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
ఇదీ జరిగింది:ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా వ్యాఖ్యాత, కమెడియన్ క్రిస్ రాక్ ఓ కామెడీ ట్రాక్‌ను చెబుతూ అందులో విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చారు. అలోపేసియా అనే అనారోగ్య సమస్య కారణంగా జాడా పూర్తిగా గుండుతో కన్పించడంతో.. క్రిస్ రాక్ ఆమెను 'జీ.ఐ.జేన్' చిత్రంలో 'డెమి మూర్' పోషించిన పాత్రతో పోల్చారు. దీంతో సహించలేకపోయిన విల్ స్మిత్ నేరుగా వేదికపై వెళ్లి క్రిస్ చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటి తర్వాత విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. అయితే ఈ ఘటనపై వేదికపైనే స్పందించిన స్మిత్ అకాడమీకి, సహచరులకు క్షమాపణలు తెలిపారు. ఆ మరుసటి రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ క్రిస్ రాక్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన భార్యపై జోకులు వేయడంతో భరించలేకే అలా ప్రవర్తించానని రాసుకొచ్చారు. ఈ వ్యవహారం కాస్త తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇదీ చదవండి: శుభశ్రీకి తాళి కట్టి.. మామకు షాకిచ్చిన ఆలీ