Jim Carrey Retirment: 'సోనిక్ ది హెడ్జ్‌హాగ్ 2' మూవీ విడుదల తర్వాత నటన నుంచి సుదీర్ఘ విరామం తీసుకుంటానని హాలీవుడ్ స్టార్ యాక్టర్ జిమ్ క్యారీ(60) చెప్పాడు. ఇప్పటివరకు తాను చాలా సినిమాల్లో నటించానని.. ఇక పూర్తిగా ఇండస్ట్రీ నుంచి వైదొలగడం లేదా విరామం తీసుకోవడం గురించి ఆలోచిస్తానని అన్నాడు.
"నేను రిటైర్మెంట్ విషయంలో సీరియస్‌గానే ఉన్నాను. బహుశా.. దేవదూతలు బంగారు సిరాతో రాసిన స్క్రిప్ట్‌ను నా దగ్గరకు తీసుకువస్తే, ప్రజలు అది చూడటం చాలా ముఖ్యమని నాకు అనిపిస్తే మళ్లీ సినిమాలో నటిస్తాను. కానీ ప్రస్తుతం మాత్రం విరామం తీసుకుంటున్నాను. నిశ్శబ్ద, ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తూ నాకిష్టమైన పెయింటింగ్స్ వేయాలనుకుంటున్నాను."
- - జిమ్ క్యారీ, హాలీవుడ్ నటుడు