Grammy Awards: సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. లాస్‌వేగాస్‌లోని ఎంజీఎం గ్రాండ్ మార్క్యూ బాల్‌రూమ్‌లో ఘనంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రపంచదేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ విజయకేతనం ఎగురవేశారు. ప్రముఖ అమెరికన్ కంపోజర్, రాక్ లెజెండ్ స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి రిక్కీ కేజ్ చేసిన 'డివైన్ టైడ్స్' ఆల్బమ్.. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్‌గా అవార్డు సొంతం చేసుకుంది.
గ్రామీ విజేతగా ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ కేజ్
Grammy Awards: ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డు విజేతగా భారత సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ నిలిచారు. ప్రముఖ అమెరికన్ కంపోజర్, రాక్ లెజెండ్ స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి రిక్కీ కేజ్ చేసిన డివైన్ టైడ్స్ ఆల్బమ్.. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్‌గా అవార్డును సొంతం చేసుకుంది.
అవార్డు గెలుపొందిన అనంతరం రిక్కీ 'నమస్తే' అంటూ అక్కడ ఉన్నవారందరికీ అభివాదం చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. "డివైన్ టైడ్స్ ఆల్బమ్‌కు గ్రామీ పొందడం ఎంతో ఆనందంగా ఉంది. మాకు ఈ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. స్టీవర్ట్ కోప్లాండ్‌కు ఇది ఆరో గ్రామీ.. నాకు ఇది రెండో గ్రామీ అవార్డు" అని రిక్కీ రాసుకొచ్చారు. యూఎస్‌లో పుట్టిన రిక్కీ చాలా ఏళ్ల క్రితమే భారతకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉంటున్నారు. 2015లో స్టీవర్ట్ కోప్లాండ్‌తో కలిసి చేసిన "విండ్స్ ఆఫ్ సంసార" ఆల్బమ్ రిక్కీకి మొదటి గ్రామీని అందించింది.
ఇదీ చూడండి:గ్రామీ అవార్డ్స్‌లో ఏఆర్ రెహ్మాన్ సందడి.. చిత్రవిచిత్రమైన డ్రెసుల్లో తారలు