తెలంగాణ

telangana

ETV Bharat / elections

భారత్​ భేరి: 'మోదీకి ఆ ధైర్యముందా..?'

దేశంలో ఎక్కడ నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉందని సీనియర్ నేత శశి థరూర్ ఉద్ఘాటించారు. అందుకే కేరళలోని వయనాడ్ నుంచి బరిలో నిలిచారని తెలిపారు. కేరళ, తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధైర్యం ఉందా అని పీటీఐ ముఖాముఖిలో ప్రశ్నించారు థరూర్.

శశిథరూర్

By

Published : Apr 8, 2019, 6:20 AM IST

కేరళ వయనాడ్​ నుంచి పోటీ చేయటం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సత్తాను తెలియజేస్తోందని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ అన్నారు. "ఇదే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీ చేయగలరా? తమిళనాడు, కేరళ నుంచి పోటీలో నిలబడగలరా?" అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ప్రశ్నించారు.

మెజార్టీ వర్గం ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలకు దూరంగా రాహుల్ పారిపోయారని మహారాష్ట్ర వార్ధా బహిరంగ సభలో ఇటీవల ప్రధాని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై శశిథరూర్ స్పందించారు.

"వయనాడ్ నుంచి రాహుల్ పోటీతో దక్షిణాదిలో ఉత్సాహం నెలకొంది. కాబోయే ప్రధానమంత్రి దక్షిణ రాష్ట్రాల నుంచి వస్తున్నారనే సంతోషం ఇక్కడి వారిలో ఉంది. రాహుల్ పారిపోయారని మోదీ, భాజపా ప్రచారం చేస్తున్నాయి. రాహుల్ నిర్ణయంతో వాళ్లే భయపడ్డారు. ప్రధానమంత్రి అంటే భారత ప్రజలందరి కోసం ఉంటారన్న సంగతి మోదీ మరచిపోయారు."
-శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత

సమాఖ్య స్ఫూర్తి కోసమే...

ఇవీ చూడండి:

అమేఠీ నుంచి రాహుల్ పోటీ చేస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. రెండో స్థానంపై కొన్నాళ్లుగా అనేక ఊహాగానాలు నడిచాయి. వాటికి తెరదించుతూ ఏప్రిల్ 4న వయనాడ్​లో నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు. తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని విశదీకరించారు థరూర్.

"భాజపా పాలనలో దక్షిణాది రాష్ట్రాలు, సమాఖ్య ప్రభుత్వం అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. ఆర్థిక భద్రత, భవిష్యత్ రాజకీయ ప్రాతినిధ్యానికి విఘాతం ఏర్పడింది. ఈ అంతరాలను రాహుల్ నిర్ణయం తుడిచేస్తుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల భేదభావం తొలగిపోతుంది. రెండు స్థానాల నుంచి రాహుల్ గెలుస్తారన్న ధీమా ఉంది. ఇదే ధైర్యం మోదీకి ఉందా?"
-శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత

భాజపా పని అంతే...

ఇవీ చూడండి:

కేరళ తిరువనంతపురం నుంచి పోటీలో ఉన్న థరూర్.. హ్యాట్రిక్ విజయంపై ధీమాగా ఉన్నారు. కేరళ నుంచి రాహుల్ పోటీతో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కూటమికి లబ్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"దక్షిణాదిని మోదీ వ్యతిరేకిస్తున్నారని ఇక్కడి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేం ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాం. రాహుల్ రాకతో కేరళలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. ఇదే స్ఫూర్తి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకూ వ్యాప్తి చెందుతోంది. ఈ నిర్ణయం కేవలం కార్యకర్తల మీదే కాదు.. మా బాధ్యతలపైనా ప్రభావం పడింది.

మైనారిటీలపట్ల అలక్ష్యంగా వ్యవహరించటం ఈ ఐదేళ్లలో అత్యంత దారుణ విషయం. అందుకే ఇప్పటికీ కేరళలో బోణీ కొట్టలేదు భాజపా. వారి భావజాలాన్ని ఇక్కడి ప్రజలు అంగీకరించట్లేదు. మరోసారి భాజపా ఆశలపై మలయాళీలు నీళ్లు చల్లడం ఖాయం."
-శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత

ABOUT THE AUTHOR

...view details