కానీ హైదరాబాద్లో ఎంఐఎం మాత్రం ఇంతవరకు అలాంటి తతంగం ఏమీ లేకుండానే కదనరంగంలో అడుగుపెడతోంది. పోటీ చేసిన ప్రతి పార్లమెంటు ఎన్నికల్లోనూ విజయం సాధించింది. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ అధికంగానే కైవసం చేసుకుంటోంది.
ఈ పార్టీకి మేనిఫెస్టో లేదు, అయినా గెలుస్తూనే ఉంది
ఎన్నికల ప్రక్రియలో ఓటర్లకు భరోసా ఇచ్చేందుకు పార్టీలు ప్రణాళికను ప్రజల ముందుంచుతాయి. గెలిచాక చేసే అభివృద్ధి, సంక్షేమంపై హామీలు ఇచ్చి ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఓ పార్టీ మాత్రం మేనిఫెస్టో లేకుండానే ప్రజల్లోకి వెళ్లి గెలుస్తోంది కూడా...
మేనిఫస్టో లేకుండా ఎన్నికల బరిలో మజ్లిస్
సాధారణంగా మేనిఫెస్టో అంటే...కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే పొందుపరుస్తారు. కానీ తమ వద్దకు వచ్చిన ప్రతి సమస్య ముఖ్యమే అంటున్నారు ఎంఐఎం నేతలు. పరిష్కారానికి ఎంఐఎం తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని భరోసా ఇస్తున్నారు. అందుకే ఎలాంటి హామీలు ఇవ్వకున్నా ఇన్నాళ్లు ప్రజలు ఆదరించారని, ఈసారీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:త్రిముఖ పోరుతో హోరాహోరీగా పాలమూరు బరి