తెలంగాణ

telangana

ఓటు హక్కు వినియోగంలో ఆదర్శంగా గిరిజనులు

By

Published : Apr 7, 2019, 6:49 PM IST

ఓటెందుకు వేయాలనే ఆలోచనే రాదు వారికి. సెలవే కదా అని సేదతీరరు. ఎండ, వాన, చలి, గాలి... ఏదీ ఆపలేవు. ఓటరు అవగాహన కార్యక్రమాలు అసలే ఉండవు. సౌకర్యాలు అంత కన్నా లేవు. కొండ కోన ఎక్కి దిగి వచ్చి మరీ బాధ్యతగా ఓటేస్తారు. అన్ని సుఖాలు అనుభవించుకుంటూ ఎన్నికల రోజు ఇంట్లో కాలక్షేపం చేసే పట్టణ, నగరవాసులకు ఆదర్శం ఈ గిరిజనులు.

గిరిజన గ్రామాల్లో అత్యదికంగా నమోదవుతున్న పోలింగ్

స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగం మాత్రం పూర్తి స్ధాయిలో జరగట్లేదు. ఇప్పటికీ చాలా చోట్ల 50 నుంచి 60 శాతం ఓట్లు మాత్రమే పోలవుతున్నాయ్. గ్రామీణులతో పోలిస్తే... పట్టణ ఓటర్లలో చైతన్యం చాలా తక్కువే. ఎంత అవగాహన కల్పించినా... పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసేవారు 60శాతానికి మించడం గగనమవుతోంది. చదువు సంధ్యా లేని గిరిపుత్రులు మాత్రం బాధ్యతగా భావించి విధిగా ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎండాకాలం బిందెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచే వీరు ఓటింగ్ కేంద్రాల్లో బారులు తీరుతున్నారు. గతంతో పోలిస్తే... ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో పోలింగ్ సాయంత్రం 4గంటలకే అయినా... సాయంత్రం 6దాకా కొనసాగుతుంది.

గిరిజన గ్రామాల్లో అత్యధికంగా నమోదవుతున్న పోలింగ్
జిల్లా మండలం గ్రామం శాతం
మహబూబాబాద్ గంగారం కొడిశలమిట్ట 98.70
కొత్తగూడ కర్నగండి 94.50
జయశంకర్ భూపాలపల్లి మహదేవ్ పూర్ పెద్దంపేట 98.20
పలిమెల ముకునూరు 95.22
మహాముత్తారం బోర్లగూడెం 92.13
ములుగు ఏటూరునాగారం రామన్నగూడెం 92.34
గోవిందరావుపేట ముత్తాపూర్ 94.52
వెంకటాపురం కేకొండాపురం 94.70
కన్నాయ్ గూడెం చింతగూడెం 93.88

ABOUT THE AUTHOR

...view details